అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండల కేంద్రంలోని దళితవాడకు విద్యుత్ అధికారులు గురువారం కరెంటు సరఫరా నిలిపివేశారు.
ఎన్‌పీకుంట: అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండల కేంద్రంలోని దళితవాడకు విద్యుత్ అధికారులు గురువారం కరెంటు సరఫరా నిలిపివేశారు. ఎవరూ మీటర్లు లేకుండా విద్యుత్‌ను వినియోగించుకుంటుండటంతో అధికారులు కనెక్షన్ తొలగించారు. దీంతో ఆగ్రిహించిన దళితులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు కాంగ్రెస్ హయాంలో ఉచితంగా కరెంటు అందించారు. ఇప్పుడూ కూడా అలాగే ఇవ్వాలని ధర్నాకు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఈ, స్థానిక ఎస్‌ఐ దళితులను శాంతింపజేశారు. ఒక్కొక్కరు రూ.120 చెల్లించి మీటర్ బిగించుకునే విధంగా వారితో మాట్లాడి ఒప్పించారు.