ఉక్కిరిబిక్కిరి ! | Power cuts in guntur district | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి !

Published Mon, Jan 27 2014 3:17 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

Power cuts in guntur district

 సాక్షి, గుంటూరు: ఎస్పీడీసీఎల్ అధికారులకు ముందుచూపు, సరైన ప్రణాళిక లేకపోవడంతో వేసవి ఆరంభానికి ముందే కరెంటు కోతలు ఊచకోతల్ని తలపిస్తున్నాయి. ఒకవైపు అధికార, అనధికార కోతలు, మరోవైపు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఇ.ఎల్.ఆర్.) పేరిట అమలు చేస్తున్న కోతలతో జిల్లా ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంటన్నర, అనధికారికంగా మరో గంటన్నర కోత విధిస్తున్నారు. పల్లెల విషయానికొస్తే పగలంతా కరెంటు ఉండటం లేదు. ఈ తరహా కోతలతో పల్లె ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అసలు కోతలు ఎందుకు అమలు చేస్తున్నారో తమకే తెలియడం లేదని ఆ శాఖ 
 అధికారులు పేర్కొనడం గమనార్హం. పై పెచ్చు ఎక్కడా థర్మల్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం కూడా లేదు. యూనిట్లు నిలిచిపోలేదు. కానీ కోత లు మాత్రం నరకం చూపుతున్నాయని జిల్లా వాసులు గగ్గోలు పెడుతున్నారు. కరెంటు కోతలతో పల్లెల్లో తాగునీటి పథకాలకు గండం పొంచి ఉంది. పల్నాడు ప్రాం తంలోని ఇప్పటికే ఆ సెగ తగిలింది. వేసవి రాకముందే ఈ విధంగా కోతలు ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
 జిల్లాలో వినియోగం పెరుగుతోందా?
  జిల్లాకు ప్రతి రోజూ 11 మిలియన్ యూనిట్లు కేటాయిస్తున్నారు. ఇందులో గుంటూరు నగరం వినియోగం 20 శాతంకు పైగా ఉంటోంది.  వ్యవసాయ విద్యుత్ వినియోగం 25 శాతం వరకు ఉంటుంది. జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 13,09,239, కమర్షియల్ సర్వీసులు 92,920, వ్యవసాయ సర్వీసులు 69 వేలు, ఎల్‌టీ సర్వీసులు 11,324 ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు కరెంటు కోటా కేటాయించడం లేదు. సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి ఎస్పీడీసీఎల్‌కు దక్కే వాటా 22 శాతం వరకు ఉంది. ఈ శాతాన్ని 25కు పెంచాలని గతంలో సీఎండీగా పనిచేసిన విద్యాసాగర్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేదు. గత వారం రోజుల నుంచి జిల్లా లో కరెంటు వినియోగం పెరుగుతోంది. కేటాయించే 11 మిలియన్ యూనిట్ల వరకు డ్రా చేస్తున్నారు. పైగా రబీ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో వ్యవసాయ కరెంటుకు డిమాండ్ పెరిగింది. 
 
 వ్యవసాయానికి కనీసం మూడు గంటలైనా సరఫరా చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా గృహ వినియోగం కూడా పెరిగింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో అన్ని జిల్లాల కంటే గుంటూరు నుంచే కరెంటు బిల్లుల డిమాండ్ ఉన్నా, కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కోతలు తమ చేతుల్లో లేవని, సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచే కోతలు మానటరింగ్ చేస్తున్నారని విద్యుత్ అధికారులు సమాధానమిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement