మళ్లీ కరెంట్ కోతలు
Published Tue, Dec 3 2013 1:51 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
గుంటూరు ఈస్ట్, న్యూస్‌లైన్: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిన కారణంగా జిల్లాలో కరెంట్ కోత విధిస్తున్నట్టు ఆ శాఖ ఎస్‌ఈ సంతోషరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్ర పరిధిలో మూడు గంటలు, మున్సిపాల్టీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల పరిధిలో ఆరు గంటలు రెండు విడతలుగా కోత అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు, మున్సిపాల్టీ పరిధిలో ఉదయం 7 నుంచి 9 వరకు, ఒంటి గంట నుంచి 3 వరకు, మండల కేంద్రాల పరిధిలో ఉదయం 7 నుంచి 10 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు వివరించారు.వ్యవసాయానికి... గ్రామీణ ఫీడర్స్ పరిధిలో ఎ-గ్రూప్‌కు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్టు తెలిపారు.
తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 వరకు తిరిగి రాత్రి 10 నుంచి 12 వరకు త్రీఫేస్ సరఫరా ఉం టుందని తెలిపారు. బి-గ్రూప్‌కు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు కోత విధించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. సి-గ్రూప్‌కు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోత విధించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు తిరిగి తెల్లవారు జామున 2 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగానికి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో మాత్రమే కోత విధించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలకు ప్రకటించిన సమయాల్లో మాత్రమే విద్యుత్ కోత అమలులో ఉంటుందన్నారు. మహానది బొగ్గు గనుల్లో ఉద్యోగుల సమ్మె కారణంగా సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రెండవ యూనిట్, వీటీపీఎస్ మొదటి యూనిట్, ఆర్‌టీపీపీ ఐదవ యూనిట్ మరమ్మతుల రీత్యా సుమారు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. మొత్తం ఆరు జిల్లాల్లో విద్యుత్ కోత విధిస్తున్నట్టు తెలుపుతూ వినియోగదారులు సహకరించాలని కోరారు.
Advertisement
Advertisement