రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం హైదరాబాద్‌పై పడింది. ప్రధాన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో గ్రేటర్ కోటాకు కోత పడింది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడటంతో విడతల వారీగా కోర్‌సిటీలో రెండు గంటలు, శివారు ప్రాంతాల్లో నాలుగు గంటల చొప్పున విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పని వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు వంటి చిరువ్యాపారాలపై కోతల ప్రభావం కనిపించింది. ఉస్మానియా, నిలోఫర్, గాంధీ, ఈఎన్‌టీ, సుల్తాన్‌బజార్ తదితర టీచింగ్ ఆస్పత్రుల్లో సుమారు రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఎక్స్‌రే మిషన్లు, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ పరీక్షల్లో అంతరాయం ఏర్పడింది.