పవర్‌కు ‘చెక్’ | Power is given to the value of the check | Sakshi
Sakshi News home page

పవర్‌కు ‘చెక్’

Published Thu, Aug 22 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Power is given to the value of the check

ఇందూరు, న్యూస్‌లైన్ : చెక్ పవర్ ఇచ్చినా దానికి విలువ లేకుండా పోయిందని సర్పం చ్‌లు పెదవి విరుస్తున్నారు. సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి కూడా చెక్‌పై సంతకం పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వి. నాగిరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలో సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్ ఉండేది. తాజా ఉత్తర్వుల్లో గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వివిధ పథకాల నిధుల వ్యయానికి సంబంధిం చి చెక్కులపై  సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శి విధిగా సంతకం చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 దీంతో అక్రమాలు అరికట్టవచ్చని, నిధుల వినియోగం పారదర్శకంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement