
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 69వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రెడ్డిగుంట బాడవ శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు.
ఆపై సురమాల గ్రామం వద్ద చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోకి ఆయన అడుగుపెడతారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతుంది. పెనబాక, పీటీ కండ్రిగ, అర్లపాడు క్రాస్, చెంబేడు మీదుగా నందిమాల క్రాస్, సీఎన్‌పేట, ఉమ్మాలపేట వరకూ పాదయత్ర కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాలో 9 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటివరకూ ఆయన 923.1 కిలోమీటర్లు నడిచారు.