సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్ర 62వ రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలురు శివారు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు.
నన్నేరు, శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చల్లావారిపల్లి మీదుగా సొరకాయలపాలెం క్రాస్, మతురుపల్లి, పులిగుంట్ల, కమ్మలపల్లి క్రాస్ వరకు కొనసాగుతుంది. అక్కడి నుంచి దేసురివారి కండ్రిగ, రావిళ్లవారిపల్లి మీదుగా పరకల్వ క్రాస్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. ఆ తరువాత భోజన విరామం ఉంటుందని రఘురాం ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment