
సాక్షి, గుంటూరు : ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 127వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం శ్రీరామ్‌నగర్ శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. చుట్టిగుంట, అంకమ్మనగర్, ఎత్తురోడ్ సెంటర్ మీదుగా నల్లచెరువు చేరుకుంటారు. మూడుబొమ్మల సెంటర్, ఫ్రూట్ మార్కెట్, జిల్నా టవర్ సెంటర్ మీదుగా కింగ్ హోటల్ సెంటర్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ 126రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. అడుగడుగునా ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో ఏకరవు పెట్టుకున్నారు. వారికి భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. నేడు 9.5 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ మొత్తం 1668.3 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.