
సాక్షి, ఒంగోలు : ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 99వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈమేరకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం పొదిలి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి కాటూరివారి పాలెం, అగ్రహారం, అన్నారం క్రాస్, తలమళ్ల, ఫిర్ధస్ నగర్, గోగినేనిపాలెం క్రాస్ మీదుగా ఉప్పలపాడు వరకు కొనసాగిస్తారు. వైఎస్ జగన్ అక్కడే రాత్రికి అక్కడే బస చేస్తారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్ జగన్ తన 98వ రోజు పాదయాత్రను ముగించారు. నేడు 13.5 కిలోమీటర్లు నడిచిన ఆయన మొత్తం 1323.8 కిలోమీటర్లు నడిచారు. చిన్నారి కట్ల జంక్షన్, కంబాలపాడు, పోతవరం మీదుగా పొదిలి వరకు పాదయాత్ర సాగింది.