సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విజయవాడ ప్రజలు నీరాజనం పలికారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన జననేతకు అగుడుగునా ఘనస్వాగతం లభించింది. వేలాది మంది రాజన్న బిడ్డకు సాదర స్వాగతం పలికారు. కనక దుర్గమ్మ సాక్షిగా తొలిరోజు విజయవంతంగా సాగిన పాదయాత్ర, రెండో రోజు షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఉదయం వైఎస్‌ఆర్ కాలనీ నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తారు. అంబాపురం, జక్కంపూడి మీదుగా కొత్తూరు తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను మీడియాకు విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 136రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసా ఇస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. నేడు వైఎస్ జగన్12.9 కిలోమీటర్లు నడిచారు. రాజన్న బిడ్డ ఇప్పటి వరకు 1765. 6 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment