
సాక్షి, గుంటూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం 120వ రోజు పాదయాత్ర ముప్పళ్లలో ముగిసింది. నేటి ఉదయం నరసారావుపేట నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
ఆపై బరంపేట, బీసీ కాలనీ, ఇనప్పాలెం మీదుగా పాదయాత్ర ములకలూరు చేరుకుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంచించారు. ములకలూరు, గొల్లపాడుల మీదుగా కొనసాగిన పాదయాత్రను వైఎస్ జగన్ ముప్పళ్లలో ముగించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నేడు 12.5 కి.మీ నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్‌గా వైఎస్ జగన్ 1598.5 కి.మీ నడిచి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment