సాక్షి, నెల్లూరు : పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తొలిసారిగా నెల్లూరు వచ్చిన సందర్భంగా ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. చేజర్ల మండలం మాముడూరు గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.15 లక్షలు వెచ్చించి పీడబ్ల్యూఎస్ స్కీం కోసం 16 గంటలు కరెంట్ సరఫరా అయ్యేలా స్తంభాలు, 11 కేవీలైన్‌ను సమకూర్చామన్నారు.
మడపల్లి, చేజర్లకండ్రిగ, పుట్టుపల్లి గ్రా మాలకు నాలుగు బోర్లు, అనంతసాగరం మండలం చాపురాలపల్లి, బొమ్మవ రం, బి.అగ్రహారం, బి.వడ్డిపాళెం, గోగులపల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.1.30 లక్షలు చొప్పున మొత్తం రూ.6.5 లక్షలతో బోర్లు, విద్యుత్ మోటార్లు సమకూర్చామన్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటికి ఇ బ్బంది పడుతున్న గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతానని ఎంపీ తెలిపారు.
తాగునీటికే ప్రాధాన్యం
Published Mon, Jun 23 2014 3:23 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement