
సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు
తాగునీరు రావడం లేదు..వీధిలైట్లు వెలగడం లేదు..దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నాం
తాగునీరు రావడం లేదు..వీధిలైట్లు వెలగడం లేదు..దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నాం..సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మళ్లీ ఈ పక్కకు తిరిగి చూడలేదు’ అని తిరుపతి 38వ డివిజన్‌లోని సింగాలగుంట ప్రజలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డికి మొరపెట్టుకున్నారు.
గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పార్టీ డివిజన్ అధ్యక్షుడు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.ఇమామ్ ఆధ్వర్యంలో శుక్రవారం సింగాలగుంటలో పర్యటించారు. ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టడమేగాక ప్రభుత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.