పాడేరు: ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.విద్యాసాగర్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శనివారం ఆయన గిరిజన సంక్షేమ విద్య, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ, మలేరియాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మన్యంలో చేపట్ట వలసిన రహదార్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
రక్షిత తాగునీటి కల్పన లక్ష్యంగా పథకాలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. రోడ్లు, రక్షిత మంచినీటి సౌకర్యాలు కల్పిస్తే వ్యాధులు గిరిజనుల దరి చేరవని, తాగునీటి కల్పనకు ఆర్‌డబ్ల్యూఎస్ విభాగానికి అదనపు నిధులు విడుదల చేస్తామన్నారు. గిరిజనాభివృద్ధికి నిధులు కొరత లేదని, ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 5.5 శాతం నిధులను గిరిజన సంక్షేమానికి కేటాయించాలని సూచించారు. సాధారణ నిధుల మంజూరులో పని చేస్తున్న సిబ్బందినే పీఎస్‌పీ నిధుల వినియోగానికి పని చేయించాలని, అదనపు సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.
మన్యంలో రోడ్లకు ప్రాధాన్యం
Published Sun, May 17 2015 2:49 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement