ఎన్నికలకు సమాయత్తం
- కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
- ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని సూచన
- సర్వసన్నద్ధమన్న కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నా రు. ప్రధాన ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ సోమవారం సా యంత్రం జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషనర్ అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సమాధానాలిచ్చారు.
ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియో తీయించాలని, పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోలింగ్ అధికారు లు, సిబ్బంది నియామకం, ఎన్నికల ని యమావళి అమలుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, ఎన్నికల వ్యవ పరిశీలకుల ని యామకం వంటి అంశాలకు సంబంధిం చి కమిషనర్ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో తహశీల్దార్లను బదిలీ జరిగిందని, నోడల్ అధికారుల నియామకం పూర్తయిందని కలెక్టర్ చెప్పారు.
పోలీస్ అధికారుల బదిలీలు, నియామకాలు, హెలికాప్టర్ల అవసరం, స్పీడ్‌బోట్ల ఆవశ్యకత, శాటిలైట్ ఫోన్స్, పోలీస్ సిబ్బంది చేరవేత వంటి అంశాలను సీపీ, ఎస్పీలు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పాడే రు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, ఏఎస్పీలు దామోదర్, కిశోర్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ నోడల్ అధికారులతో తన చాంబర్‌లో సమావేశమై ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.