
ఆస్తి పన్ను పోటు
వడ్డీ పన్నుతో వడ్డింపు
ఆస్తిపన్ను బ కాయి రూ.100 కోట్లు
వడ్డీ రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లు
ఈ ఏడాది వడ్డీ మాఫీ లేనట్టే!
గృహ యజమానులు గగ్గోలు
గృహ యజమానులకు జీవీఎంసీ చుక్కలు చూపిస్తోంది. ఆస్తిపన్నుకు వడ్డీ కలిపి నడ్డివిరుస్తోంది. అసలెంతో.. వడ్డీ ఎంతో..ఎందుకంత ఎక్కువ మొత్తం కట్టాలో తెలియక ఇంటి యజమానులు తలపట్టుకుంటున్నారు.
విశాఖపట్నం సిటీ: ఆస్తి పన్నుపై ఏటా వడ్డీ మాఫీ అయ్యేది. ఏడాదికి రెండు విడతలుగా ఇచ్చే అసెస్‌మెంట్ బిల్లులు మొత్తాన్ని మార్చి నెలాఖరులోగా చెల్లించేవారు. కానీ ఈసారి డిసెంబర్ నుంచే ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆధార్‌తో పాటు అసెస్‌మెంట్‌ను జారీ చేసేస్తున్నారు. అసెస్‌మెంట్ చూసుకున్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇంత ఎక్కువ పన్ను వచ్చిందేమిటని వాపోతున్నారు.