సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని మహిళా సంఘాలను అధికారులు విస్మరిస్తున్నా రు. ఖరీఫ్, రబీల్లో రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ అండగా నిలుస్తు న్న సంఘాలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. అడిట్‌కు లింకు పెట్టి కాలయాపన చేస్తున్నారు. దీంతో వారికి రావాల్సిన రూ.కోట్ల కమీషన్ రావడం లేదు.
ధాన్యం కొనుగోలులో సింహభాగం
రైతులు పండించిన చోటే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకోవడం.. రవాణా భారం తగ్గించడం.. మహిళలను ఆర్థికం గా బలోపేతం చేయడానికి ప్రభుత్వం గ్రామైఖ్య సంఘాల ధ్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో 2005-06 నుంచి ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి సీజన్‌లో రైతులు పండిం చిన ధాన్యంలో సింహభాగం గ్రామైక్య సంఘాలే కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో 2.5 శాతం కమీషన్ చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల నుం చి గ్రామైక్య సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాయి.
2012-13 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 121 గ్రామైక్య సంఘాలు 66,415 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. ఇందులో 90 శాతం ‘ఏ’గ్రేడ్ ధాన్యం ఉంది. కొనుగోలు చేసినందుకు అయిన ఖర్చు రూ. 84.14 కోట్లు. ఇందులో 2.5 శాతం చొప్పున రూ. 2.10 కోట్ల కమీషన్ ఇవ్వాల్సి ఉంది. అదే ఏడాది ర బీలో 82 గ్రామైక్య సంఘాలు కలిసి రూ. 39.08 కోట్లు చెల్లించి 30,515 మె.ట. ధాన్యం కొనుగోలు చేశాయి. వీరికి కమీషన్ రూపంలో రూ. 97 లక్షలు రావాల్సి ఉంది. అయితే.. ఏటా ధాన్యం కొనుగోలు చేసిన మూడు నెలల నుంచి ఐదు నెలలలోపు ఐకేపీ అధికారులు కమీషన్ డబ్బులు చెల్లించే వారు.
అడిట్ అయితేనె..
గ త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కమీషన్ డబ్బులు చెల్లించాల్సిన ఐకేపీ అధికారులు ముందుగా కొనుగోళ్లపై ‘ఆడిట్’ చేపట్టిన తర్వాతే కమీషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంత వరకు ఆడిట్ పూర్తి కాకపోవడంతో ఆయా సంఘాలకు కమీషన్ అందలేదు. 2005-06 నుంచి ఇప్పటి వరకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన కొనుగోళ్లు.. గ్రామైక్య సంఘాలకు చెల్లించిన కమీషన్ తదితర వివరాలపై అడిట్ చేస్తున్నారు. అయితే.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేసి కమీషన్ డబ్బులు చెల్లించాలని సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయమై ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్టు మేనేజర్ తిరందాసు అడుగగా.. కొనుగోలు కమిటీ సభ్యుల నుంచి సమాచారం సేకరించాం. ఆడిట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే కమీషన్ డబ్బులు చెల్లిస్తాం’ అని చెప్పారు.
కొనుగోళ్లు సరే.. కమీషన్ ఊసేది..!
Published Sun, Dec 29 2013 5:03 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement