శంషాబాద్, న్యూస్‌లైన్: నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బేగం ఇండియా గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిజమైన లభ్ధిదారులకు న్యాయం చేకూరేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఏటా రూ.12 వేల కోట్ల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. దళితుల ఉన్నత విద్య కోసం ఇందులోంచి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. అనంతరం లభ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు, హౌసింగ్ పత్రాలను అందజేశారు.
తెలంగాణవాదుల లొల్లి
రచ్చబండ వేదికపై ఉన్న బ్యానర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ను తొలగించాలంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు. మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రసంగం కొనసాగుతుండగా నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడారు.. శంషాబాద్‌లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని, మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రేషన్‌కార్డులున్నా ఆధార్ కార్డులు లేనివారికి సరుకులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా 820 ఫించన్లు, 54 రేషన్ కార్డు లు, 540 హౌసింగ్‌పత్రాలను అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి రేషన్‌కార్డులు, హౌసింగ్, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 24 గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఫంక్షన్‌హాలు కిక్కిరిసిపోయింది. దరఖాస్తులు ఇచ్చేందుకు జనం నానా ఇబ్బందులు పడ్డారు.
నిరుపేదల సంక్షేమం కోసమే ‘రచ్చబండ’
Published Tue, Nov 19 2013 12:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement