సాక్షి, అమరావతి: జపాన్‌లో పరిశోధన చేసిన అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏపీ రాజధాని అమరావతిలో నెలకొల్పడానికి ఆ దేశానికి చెందిన సుమితోమో కార్పొరేషన్‌లోని తోషిబా గ్రూపు ముందుకు వచ్చింది. గురువారం అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీపార్థసాథిని ఈ బృందం అధికారులు కలుసుకున్నారు. ముందుగా లక్ష్మీపార్థసార«థి తోషిబా అధికారులకు రాజధాని అమరావతి భౌగోళిక వైవిధ్యం, అక్కడి సహజ వనరులు, రాజధాని బృహత్తర ప్రణాళికలను వివరించారు. అనంతరం తోషిబా ప్రతినిధులు భారీ వర్షాలను ముందే గ్రహించి వాటిని అదుపు చేయగల అత్యాధునిక సాంకేతిక పద్ధతితో రూపొందించిన రాడార్ వ్యవస్థలోని ప్రధాన అంశాలను చైర్‌పర్సన్‌కు వివరించారు. ఈ వ్యవస్థను మన వాతావరణానికి అనుసంధానం చేయవచ్చని వివరించారు. అలాగే రాడార్ ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామని ప్రతిపాదించారు. దీనిపై లక్ష్మీపార్థసార«థి సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని కొండవీటి వాగు వరద ముంపు నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.