రైల్వేలో పీపీలను రద్దు చేయాలి
దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్
గుంతకల్లు: భారతీయ రైల్వేలో పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్‌షిప్ (పీపీపీ)లను ర ద్దు చేయాలని దక్షిణ మధ్య రైల్వేలో ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివి జన్ ప్రధాన కార్యదర్శి కేవీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయం వద్ద బుధవారం ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలు త సంఘ్ కార్యాలయం నుంచి డీఆర్‌ఎం కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ధర్నాను ఉద్దేశించి సంఘ్ ప్రధాన కార్యదర్శి కేవీ శ్రీనివాసులు మాట్లాడారు. రైల్వేలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరికాదన్నారు. ొత్త పెన్షన్ విధానం అమలుతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. దసరా పండుగకు ఇచ్చే బోనస్‌పై సీలింగ్‌ను ఎత్తివేసి ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలువాలన్నారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త రైళ్లకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలన్నారు. గ్రూప్-సీ పోస్టులను గ్రూప్-బీ గెజిటెడ్‌గా గుర్తించాలన్నారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్‌లకు చెందిన సంఘ్ బ్రాంచ్‌ల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి దౌల్తాపురం ప్రభాకర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు బి.బాబు, ఖాజాగరీబ్‌నవాజ్, డీఎన్ రెడ్డి, సోమశేఖర్, డివిజనల్ ఆఫీస్ బ్రాంచ్ సెక్రెటరీ శేషయ్య, కమర్షియల్ బ్రాంచ్ సెక్రెటరీ పక్కీరయ్య ు పాల్గొన్నారు.