
మహారాణిపేట(విశాఖ దక్షిణం): ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు వాయవ్య భారత దేశం నుంచి ఉపసంహరణ మొదలు కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటీరియల్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది. దీని వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాల వాయవ్య భారతదేశం నుంచి ఉపసంహరణ మొదలు కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.