సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరో 48 గంటల్లో తుపానుగా మారనుంది. దీంతో రెండ్రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం ఇన్‌చార్జి డెరైక్టర్ సీతారాం తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని, వాయుగుండానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో చలిగాలులు వీస్తాయన్నారు. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లా అమరాపురంలో 8 సెం.మీ., కల్యాణదుర్గం, తెనాలిలో 7, అద్దంకి, కనేకల్‌లలో 4, కారంచేడులో 3, ఒంగోలులో 2 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అరేబియా సముద్రంలో వాయుగుండం
Published Sun, Oct 26 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement