నేటినుంచి ‘రైతుహిత’ సదస్సులు | 'raituhita' Seminars from today | Sakshi
Sakshi News home page

నేటినుంచి ‘రైతుహిత’ సదస్సులు

Published Sun, Dec 1 2013 2:01 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

'raituhita' Seminars from today

కలెక్టరేట్, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా రైతులను సమాయత్తం చేయడానికి ‘రైతుహిత’ పేరిట ఆదివా రం నుంచి సమగ్ర రైతు సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి సాగు పద్ధతులు, పంట మార్పిడి, కలుపు నివారణ, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, ఆరుతడి పంటలు, ఉద్యా న పంటలు, పూలు, పండ్ల తోటల పెంపకంతోపాటు పాల ఉత్పత్తి తదితర అంశాలపై నియోజకవర్గ పరిధి లో ఉత్తమ ఫలితాలు సాధించిన రైతులతో  సలహా లు, సూచనలతో కూడిన అవగాహన కల్పిస్తామని ఆ మె పేర్కొన్నారు.

 జిల్లాలో మట్టి సామర్థ్యానికి అనుగుణంగా పంటలను పండించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. సాగులో రైతు పెట్టుబడిని తగ్గించడానికి అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించడం, డ్రమ్ సీడింగ్ విధానంలో వరి నాటడంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీటితోపాటు వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, పట్టుపరిశ్రమ, విద్యుత్, బ్యాంకర్లు తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే అవగాహన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
 దుబ్బాక నుంచి ప్రారంభం..
 నియోజకవర్గాల వారీగా నిర్వహించే రైతు హిత సదస్సులను దుబ్బాక నుంచి ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అవగాహనసదస్సును మిరుదొడ్డిలోని టీటీ డీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. డి సెంబర్ 4న గజ్వేల్, 5న సిద్దిపేట, 6న నర్సాపూర్, 12న నా రాయణఖేడ్, 20న సంగారెడ్డి, 21న పటాన్‌చెరు ని యోజకవర్గాలకు సంబంధించి సమగ్ర రైతు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement