శ్రీకాకుళం అర్బన్: గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు పది మంది వరకూ ఉన్నారంటూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. క్షతగాత్రులకు రాజయండ్రిలో వైద్యసేవలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను వారి వారి గ్రామాలకు పంపించే ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలిస్తున్నారన్నారు. జిల్లా నుంచి వెళ్లే భక్తులు పుష్కరయాత్రలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు అరవల రవీంద్ర ఉన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ
Published Wed, Jul 15 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement