వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం  | Rajanna Rajayam Possible Through Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం 

Published Thu, Apr 4 2019 10:01 AM | Last Updated on Thu, Apr 4 2019 10:03 AM

Rajanna Rajayam Possible Through Ysrcp - Sakshi

ఎన్నికల ప్రచారంలో కేతిరెడ్డి సాయిప్రతాప్‌రెడ్డి 

సాక్షి, తాడిపత్రి అర్బన్‌: వైఎస్సార్‌సీపీతోనే రాజన్న రాజ్యం రానుందని కేతిరెడ్డి సాయిప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం నందలపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా, వారు ప్రతి గడపకూ తిరుగుతూ నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీసెల్‌ జనరల్‌ సెక్రటరీ పూల బాలరాజు, అనంతపురం పార్లమెంట్‌  ఎస్సీసెల్‌ సెక్రెటరీ సునీల్‌ కుమార్, పేరం ప్రతాప్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ బాలరాజు, నాగభూషణ ం, అలీ, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.  


రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో.. 
యల్లనూరు రోడ్డు, జయనగర్‌ కాలనీలలో బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బార్‌ బాష, సాంస్కృతిక విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయుడు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శులు నరసింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వరప్రసాద్, నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి, తేజ, రఫీ పాల్గొన్నారు.

 
కేతిరెడ్డి రమాదేవి,  రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆధ్వర్యంలో.. 
పట్టణంలోని గాజుల క్రిష్టప్ప వీధి, గాంధీనగర్, వాటర్‌ వర్క్స్‌ రోడ్డు ప్రాంతాల్లో కేతిరెడ్డి రమాదేవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పేరం స్వర్ణలత ఆధ్వర్యంలో,  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్మిక శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాథరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ జిల్లా మహిళా విభాగం కార్యదర్శులు వసంతం మౌళేశ్వరి, నాగూర్, షరీఫా,  అనంతపురం పార్లమెంట్‌ జిల్లా బీసీసెల్‌ జనరల్‌ సెక్రెటరీ వెంకటేష్, ఓబులరెడ్డి, పేరం అమర్నాథరెడ్డి, చిన్న కాంతమ్మ, అశోక్‌రెడ్డి, చరణ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 


తాడిపత్రి మండలంలో.. 
మండలంలోని భోగసముద్రం, బుగ్గ గ్రామాల్లో , తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని, నియోజకవర్గ యూత్‌ కన్వీనర్‌ అయ్యవారిపల్లి రామ్మోహన్‌ రెడ్డి గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి,  సూర్యనారాయణరెడ్డి, బుగ్గ రాజు, రామకృష్ణ, శ్రీను, నారాయణస్వామి, లక్ష్మయ్య, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement