హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పమన్నారని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్నాథ్ మాట్లాడులూ.. మోడీ తరపున చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తాయని అన్నారు. ఈ సభలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాల సహకరిస్తాం
Published Sun, Jun 8 2014 8:35 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement