కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘నేను రాష్ట్ర మంత్రిని కాదు.. ఢిల్లీ మం త్రిని నేను చెప్పిన వారినే రేషన్ డీలర్ పోస్ట్‌కు ఎంపికచేయా లి’ అని ఒక మంత్రి, ‘నేను రాష్ట్ర మంత్రిని అంతా నా చేతి లోనే ఉంటుంది. నేను చెప్పిన వారికే డీలర్ పోస్ట్ ఇవ్వాలి’ అంటూ మరోమంత్రి..ఇలా జిల్లాలో రేషన్‌డీలర్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీవరకు పైరవీలు ప్రారంభించారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరగడంతో ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని మండలా ల్లో ఖాళీగా ఉన్న 18డీలర్ పోస్టులకు అధికారులు ఇటీవల రాత పరీక్షను పూర్తి చేసుకుని ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు సిద్ధమయ్యారు.
కానీ పరీక్షకు హాజరైన అభ్యర్థులేమైనా పిచ్చివాళ్లా, తమ సత్తా ఏమిటో అధికారులకు చూపిం చాలనే ఉద్దేశంతో తననే ఎంపిక చేయాలంటూ పైరవీలను ఢిల్లీకి చేర్చారు. దీంతో ఓ మంత్రి ఢిల్లీ నుంచి అధికారులకు ఫోన్‌చేసి తాను చెప్పిన వారినే ఎంపిక చేయాలని ఒత్తిడితెచ్చారు.ఈ విషయాన్ని తెలుసుకున్న మరికొంత మంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి మంత్రులను ఆశ్రయించి, ఒకరికి మించి ఒకరు మంత్రులచే అధికారులపై ఒత్తిళ్లకు దిగారు. ఇంతవర కు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సఫ్లై, ఇన్‌చార్జి మంత్రి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచా రం. వీరికి ధీ టుగానే జిల్లా మంత్రి సైతం ఇదే తరహా ఒత్తిళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ ఒత్తిళ్లతో రేషన్ డీలర్ల ఎంపిక ఎలా చేయాలో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
మిడ్జిల్ డీలర్‌కు బలే డిమాండ్
మిడ్జిల్ మండల కేంద్రంలో డీలర్ పోస్ట్ ఖాళీగా ఉండగా, దీనికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, జిల్లా మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే మల్లురవి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు ఫోన్లు చేసి తమ అనుచరులకే ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తుండడంతో, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఎవరు తమ మాట నెగ్గించుకుంటా రో వేచి చూడాల్సిందే.
కంగుతింటున్న ఎమ్మెల్యేలు
డీలర్ పోస్టులకు ఎంపికకు ఎప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు ఉండేవి, కానీ ఈసారి అభ్యర్థులు ఎమ్మెల్యేలను పక్కనపెట్టి మంత్రులను ఆశ్రయించడంతో వారంతా కంగుతింటున్నారు. ఇక రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా ఇప్పుడు మంత్రులచే ఫోన్లు చేయించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు. దీంతో ఇంకేముంది రోజుకు వందల సంఖ్యలో అధికారులకు ఫోన్ల ఒత్తిళ్లు పెరిగాయి. డీలరు పోస్టులకు మంత్రులస్థాయి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. దీంతో రాత పరీక్షలో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారా? లేక పైస్థాయి మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి అభ్యర్థుల ఎంపిక చేస్తారానేది? ప్రస్తుతం పద్మవ్యూహంలో పడింది. ఇక ఎప్పుడు లేనంతగా ఈసారి రేషన్ డీలర్ పోస్టుల భర్తీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
రేషన్ డీలర్ కోసం ఢిల్లీ దాకా..!
Published Sat, Oct 26 2013 3:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement