చిత్తూరు (సెంట్రల్): జిల్లాలోని తెల్లరేషన్ కార్డు కలిగిన ల బ్ధిదారులు వారి కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధా నం చేస్తేనే సెప్టెంబర్ నెల నుంచి నిత్యావసర సరుకుల స రఫరా జరుగుతుందని, లేదంటే కట్ చేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విజయరాణి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో జిల్లాలోని సీఎస్ డీటీలు, గ్యా స్ డీలర్లతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల న్నింటినీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ విధానంలో చౌకదుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకులను పకడ్బందీగా పేదలకు అం దజేసేందుకు ఆధార్‌కార్డు అనుసంధానం తప్పని సరన్నా రు. జిల్లాలో ఇప్పటికే 90 శాతానికి పైగా రేషన్ కార్డుదారులు వారి కార్డులను ఆధార్‌తో అనుసంధానం పూర్తి చే శారన్నారు.
మిగిలిన కార్డుదారులు కూడా ఈనెల 31వ తే దీ లోపు ఆధార్‌కార్డులతో రేషన్ కార్డులను అనుసంధానం పూర్తి చేయాల్సిన బాధ్యత సీఎస్ డీటీలదేనన్నారు. అలాగే గ్యాస్ వినియోగదారులు వారి గ్యాస్ సర్వీసు నెంబర్లతో ఆధార్‌కార్డులను అనుసంధానం చేయించుకోవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు.
డీలర్లు, సీఎస్‌డీటీలు సం యుక్తంగా ఆధార్ అనుసంధానం పూర్తి చేయించాలన్నా రు. ప్రధానంగా దీపం పథకం ద్వారా సిలిండర్ పొందిన గ్యాస్ వినియోగదారులు వారి కనెక్షన్లను ఆధార్‌తో అ నుంధానం చేయించుకుంటేనే గ్యాస్ సరఫరా చేస్తామన్నా రు. లేదంటే గ్యాస్ రాయితీ నిలిపి వేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గ్యాస్‌డీలర్లు , ఏఎస్వో, సివిల్ సప్లరుుస్ ఉప తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఆధార్ నంబర్లు ఇస్తేనే రేషన్
Published Fri, Aug 29 2014 3:59 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement