అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ప్రతి నెలా తెల్లరేషన్ కార్డు వినియోగదారులకు రేషన్‌తోపాటు కిరోసిన్, అమ్మహస్తం పథకం కింద 9 రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఆగస్టు నుంచి ఆధార్‌కార్డు నంబర్ ఉన్నవారికి మాత్రమే రేషన్ అందుతుంది. ఇందులో భాగంగా జనవరి నుంచే అధికారులు వినియోగదారుల ఆధార్ నంబర్లు సేకరించి రేషన్‌కార్డు నంబర్‌తో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 11,35,270 కార్డులున్నాయి. జిల్లాలో ఇప్పటిదాకా 26 లక్షల మందికి ఆధార్ అనుసంధానం పూర్తి చేశారు. మొత్తం జిల్లాలో 35లక్షల మంది పేద ప్రజలు ఉన్నారు. రేషన్‌కార్డు నంబర్ ప్రాతిపదికనే కాకుండా అందులో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్‌ను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాలో 41 లక్షల మంది జనాభా ఉండగా దాదాపు 6 లక్షల మందికి కార్డులు అందాల్సి ఉంది.
ఇందులో అధికశాతం పేదలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 65 శాతం మంది లబ్ధిదారుల నుంచి ఆధార్ నంబర్లు సేకరించి వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. కార్డులో ఉన్న వారందరికీ ఆధార్ నంబర్ ఉంటేనే రేషన్ అందుతుంది. పాక్షికంగా జూలై నుంచి పూర్తి స్థాయిలో ఆగస్టు నుంచి అమలు చేయనున్నారు. ఈ-పీడీఎస్ అమలులో భాగంగా ఇప్పటికే డీలర్‌లకు పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆధార్ నంబర్ లేకపోతే రేషన్ లేదు..
ఆధార్ నంబర్ ఇచ్చిన వారికి మాత్రమే జూలై నెల రేషన్ పంపిణీ చేస్తాం. రేషన్‌డీలర్లను ఆధార్ నంబర్లు తీసుకోవాలని ఆదేశించాం. కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించిన నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ లేనివారికి రేషన్ అందదు.
- ఉమామహేశ్వర్‌రావు, డీఎస్‌ఓ
ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్!
Published Mon, Jun 23 2014 2:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement