
‘ఆకలికేక’ ప్రత్యేక ఉద్యమానికి నాంది
‘కడప గడపలో నిర్వహించిన ‘ఆకలికేక’ ప్రత్యేక ఉద్యమానికి నాంది కావాలి..
రాయలసీమ రాజధాని సాధన సమితి అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డ
కడప: ‘కడప గడపలో నిర్వహించిన ‘ఆకలికేక’ ప్రత్యేక ఉద్యమానికి నాంది కావాలి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమ హక్కు.. విశాలాంధ్ర కోసం త్యాగం చేసిన రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి.. నాడు జస్టీస్ శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన నేపథ్యంలో, నేడు శివరామకృష్ణ కమిటీ రాజధాని ఏర్పాటుపై రాయలసీమ వెనుకబాటు తనంపై స్పష్టమైన నివేదికలందించాయి..
రియల్ ఎస్టేట్ వ్యాపారుల మెప్పునకు, సర్కారు ప్రాంత నేతల ఒత్తిడికి తలొగ్గి సీఎం చంద్రబాబు యోగ్యంకాని విజయవాడను రాజధానిగా ప్రకటించారు’ అని మాజీ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. కడపలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో రాయలసీమ రాజధాని సాధన సమితి నేతృత్వంలో ‘ఆకలికేక’ కార్యక్రమం నిర్వహించారు.