జేడీఏలకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశం
హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో బుధవారం ఆయన ఖరీఫ్ సన్నద్ధతపై జిల్లా సంయుక్త సంచాలకుల (జేడీఏ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో సోయాబీన్ 2 లక్షలు, పచ్చిరొట్ట విత్తనాలు 90 వేల క్వింటాళ్లమేర సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు సీడ్ కార్పొరేషన్, ఆయిల్ సీడ్ ఫెడరేషన్, హాకాలకు ఆదేశాలిచ్చామన్నా రు. ఈ నెల 15వ తేదీలోగా విత్తనాలను మండల కేంద్రాల్లో అందజేయాలన్నారు.
రుణమాఫీ పరిశీలనకు గ్రామాల ఎంపిక...
గత ఏడాది రుణమాఫీకి విడుదల చేసిన నిధులకు సంబంధించి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి ధ్రువీకరణ పత్రాలు రాలేదని... వాటిని వ్యవసాయాధికారులు అందజేయాలని ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు. ఖర్చుపెట్టని నిధులను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలన్నారు. కొన్నిచోట్ల రుణమాఫీలో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసి పంట రుణమాఫీ పథకాన్ని పరిశీలించాలన్నారు.
ఖరీఫ్‌కు సన్నద్ధంకండి
Published Thu, May 7 2015 2:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement