రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ | Real star Srihari statue innovation | Sakshi
Sakshi News home page

రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ

Published Fri, Nov 14 2014 3:45 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ - Sakshi

రియల్‌స్టార్ శ్రీహరి విగ్రహావిష్కరణ

అంబాజీపేట : సామాజిక సేవతోపాటు రియల్ స్టార్‌గా పేరొందిన దివంగత సినీనటుడు ఆర్.శ్రీహరి విగ్రహాన్ని  గురువారం  అభిమానులు ఆవిష్కరించారు. అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా కాపు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని  కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు  చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం కన్నబాబు మాట్లాడుతూ శ్రీహరి సినీ నటునిగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందున్నారని కొనియాడారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడు యేడిద శ్రీను,  కల్వకొలను తాతాజీ, గణపతి బాబులు, పత్తి  దత్తుడు, గణపతి వీరరాఘవులు, సుంకర బాలాజీ, నూకల గౌరీష్, కొర్లపాటి వెంకటేశ్వరరావు, సూదాబత్తుల రాము, గొల్లపల్లి బాబి, దాసం బాబి, సలాది స్వామి,  పత్తి దత్తుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement