వడమాలపేట, పుత్తూరు, న్యూస్‌లైన్: తమిళనాడుకు చెందిన 76 మంది ఎర్ర కూలీలు మంగవారం రాత్రి బస్సులో వస్తూ వడమాలపేటలో పట్టుబడ్డారు. అలాగే పుత్తూరులో సోమవారం రాత్రి ఎనిమిది మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. రేణిగుంట రూరల్ సీఐ రామ్‌కుమార్ కథనం మేరకు.. తమిళనాడులోని సేలం పరిసరాలకు చెందిన 76 మంది యువకులు మంగళవారం సాయంత్రం తిరుత్తణి బైపాస్‌రోడ్డులో తిరుపతికి వెళ్లేందుకు కంచి-శ్రీకాళహస్తి ప్రయివేటు బస్సు ఎక్కారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ పుత్తూరులో ఇదే బస్సులో ఎక్కారు. బస్సులో అంతా యువకులు ఉండడంతో అనుమానం వచ్చి వారిని విచారించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఏర్పేడు ఎస్‌ఐకు సమాచారం అందించారు. ఆయన వడమాలపేట ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు విషయం తెలియజేశారు. రాత్రి 7 గంటల సమయంలో వడమాలపేట ఎస్‌ఐ, సిబ్బంది వెంటనే రోడ్డు మీదకు చేరుకున్నారు.
బస్సును నిలిపి తనిఖీ చేస్తుండగా కొందరు పారిపోయేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో గ్రామంలోని యువకులు పోలీసులకు సహకరించి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పట్టుకున్నారు. నిందితులను పోలీసులకు అప్పగించారు. పది గొడ్డళ్లు, కత్తి, తూకం వేసే పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. కూలీలను పిలిపించిన వారిని తెలుసుకుని అరెస్ట్ చేస్తామని సీఐ రామ్‌కుమార్ తెలిపారు. కూలీలను పట్టుకునేందుకు సహకరించిన గ్రామస్తులు, కానిస్టేబుల్ ప్రభాకర్, వడమాలపేట ఎస్‌ఐ రాజ్‌కుమార్, ట్రైనీ ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బందిని అభినందించారు. టాస్క్‌పోర్స్ సీఐ అశోక్ సమాచారం తెలుసుకుని వడమాలపేటకు వచ్చారు.
నాకాబందీలో ఎర్రదొంగలు పట్టివేత
పుత్తూరు పట్టణం పున్నమి బైపాస్‌రోడ్డులో సోమవారం రాత్రి నిర్వహించిన నాకాబందీలో 8 మంది ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డారు. వీరు తమిళనాడులోని సేలం ప్రాంత వాసులని ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. వీరంతా సుమోలో తిరుపతి వైపు వస్తూ పట్టుబడ్డారు. నిందితుల నుంచి 5 ఎర్రచందనం దుంగలు, గడ్డపారలు, కొడవళ్లు, గొడ్డళ్లు, వంట సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
======
10పిటిఆర్106,107: పోలీసుల అదుపులో ఉన్న ఎర్రచందనం కూలీలు
10పిటిఆర్108: ఆయుధాలను పరిశీలిస్తున్న సీఐ రామ్‌కుమార్
10పిటిఆర్109.110: కూలీల వద్ద లభించిన ఆయుధాలు, బ్యాగులు
ఎర్రదొంగలు బస్సులో వస్తూ పట్టుబడ్డారు
Published Wed, Dec 11 2013 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement