రూ. 20 లక్షల విలువైన దుంగలు స్వాధీనం
చంద్రగిరి: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన టీడీపీ నేత మల్లెల చంద్రను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి సీఐ శివప్రసాద్ శనివారం తెలిపిన వివరాలు.. ముందస్తు సమాచారం మేరకు చంద్రగిరిలోని కేఎంఎం కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో 18 మంది దుంగలను మోసుకొస్తుండగా దాడిచేశారు.
చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన టీడీపీ నేత మల్లెల చంద్ర, తిరుపతి మంగళానికి చెందిన పవన్‌కుమార్, తమిళనాడు తిరుత్తణి తాలూకా అలిమేలు మంగాపురానికి చెందిన ఉమాపతిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం రవాణాలో టీడీపీ నేత అరెస్ట్
Published Sun, Apr 17 2016 2:29 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Advertisement