చిలంకూరు(ఎర్రగుంట్ల), న్యూస్‌లైన్: మండల పరిధిలోని చిలంకూరు యానాది కాలనీవాసులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఉపాధి జాబ్‌కార్డులున్నా పనులు కల్పించలేదు. కాలనీలో సుమారు 25 కుటుంబాలవారున్నారు. వారి ప్రధాన వృత్తి కట్టెలు, మొద్దులను కాల్చి బొగ్గులు తయారు చేయడం. వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కాలనీలో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.
బ్యాంకు రుణాలు లేవు. ఇందిరమ్మ గృహాలు రాలేదు. వీధిలైట్లు, మరుగుదొడ్లులేవు. సుమారు 20మంది పిల్లలనురెండు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపాల్సి ఉంది. రోడ్డుపైన చిన్న పిల్లలను పంపడానికి భయపడి పాఠశాలకు పంపడంలేదు. ఎలాంటి ఉపాధి అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులందరూ కొండల్లోకి వెళ్లి పోయి కట్టెలు సేకరించి బట్టీలుగా పేర్చి, వాటికి కాల్చి బొగ్గులు అమ్ముకుని జీవనం గడుపుకుంటున్నారు.
ఒక్కొక్క బట్టీలో సుమారు 30 నుంచి 40 బస్తాల బొగ్గుల లు అవుతాయని, ఒక్కో బస్తా రూ.300కు కాంట్రాక్టరుకు ఇస్తామని వారు తెలిపారు. అదే మార్కెట్‌లో అమ్మకుంటే రూ.500కు అమ్ముకోవచ్చని, ముందుగా కాంట్రాక్టరువద్ద డబ్బులు తీసుకుంటున్నందున అతనికు అమ్మాల్సి వస్తోందన్నారు. బొగ్గుబట్టీల పొగతో కాలనీలో చాలామంది ఆనారోగ్యానికి గురవుతున్నారని, ఇటీవల ఒక వ్యక్తి మృతి చెందాడని చెప్పారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
బూడిద బతుకులు
Published Sat, Jan 18 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement