- అసెంబ్లీ 42
- లోక్‌సభ 6
- ముగిసిన పరిశీలన
- 23 వరకు ఉపసంహరణకు గడువు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 347 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో వివిధ కారణాలతో 42 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 305 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించి ఆమోదించారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి 14 నామినేషన్లకు గాను రెండింటిని తిరస్కరించారు. 12 నామినేషన్లను ఆమోదించారు.
విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి 31 నామినేషన్లకు గాను నాలుగింటిని తిరస్కరించారు. 27 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 వరకు గడువు ఉంది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి వేముల పార్వతి (టీడీపీ), ఆలపాటి లక్ష్మీనారాయణ (బీజేపీ) నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి యక్కంటి పుల్లారెడ్డి (స్వతంత్ర), కేశినేని పావని (టీడీపీ), సీహెచ్ హరిబాబు (స్వతంత్ర), కోగంటి స్వప్నచందు (కాంగ్రెస్) నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
తిరస్కరణకు గురైన అసెంబ్లీ నామినేషన్లు ఇవీ..
తిరువూరులో నల్లగట్ల సుధారాణి (టీడీపీ), పరసా విజయరాణి (కాంగ్రెస్), బంకా జాన్‌సుందరరావు (సీపీఐ-ఎం), గన్నవరంలో వెలగా నరసింహారావు (సీపీఎం), వల్లభనేని పంకజశ్రీ (టీడీపీ),గుడివాడలో రావి సుధారాణి (టీడీపీ), కొడాలి నాగేశ్వరరావు (వైఎస్సార్ సీపీ), కైకలూరులో పి.ప్రభాకరరావు (స్వతంత్ర), పెడనలో కె.కృష్ణప్రసాద్ (టీడీపీ డమ్మీ అభ్యర్థి), బందరులో టి.నిరంజనరావు (స్వతంత్ర), కొల్లు నీలిమ (టీడీపీ డమ్మీ అభ్యర్థి), అవనిగడ్డలో కెప్టెన్ లక్ష్మి (వైఎస్సార్ సీపీ డమ్మీ అభ్యర్థి), సైకం విజయలలిత స్వతంత్ర, పోలబత్తిన చిన్నప్ప (సీపీఐ-ఎం), దొండపాటి మోహనరావు (స్వతంత్ర), పామర్రులో మద్దాలి నాగరాజు (లోక్‌సత్తా), పెనమలూరులో నందిగామ సంతోష్ హిమసవిత (కాంగ్రెస్), బోడే హేమచౌదరి (టీడీపీ), విజయవాడ పశ్చిమలో వి.శ్రీవాణి (బీజేపీ), జి.బాలకోటేశ్వరరావు (సీపీఐ), పి దాసు (స్వతంత్ర), పి.యోహాన్‌రాజు (స్వతంత్ర), కలివి లక్ష్మణరెడ్డి (స్వతంత్ర), డొక్కా సుజనారావు (స్వతంత్ర), సెంట్రల్‌లో సూరిశెట్టి వరప్రసాద్ (కాంగ్రెస్), బొండా సుజాత (టీడీపీ), మల్లాది కిరణ్మయి (కాంగ్రెస్), దాళ్వా విష్ణువర్ధన (సీపీఐ-ఎం), నట్ల విద్యాసాగర్ (బీఎస్పీ), మహ్మద్ ఇస్సాక్ (ఏజేఎఫ్‌బీ), తూర్పులో వేమూరి బి.కుటుంబరావు (కాంగ్రెస్), గద్దె అనురాధ (టీడీదీ), మైలవరంలో డి.అనుపమ (టీడీపీ), వి.నాగపవన్‌కుమార్ (స్వతంత్ర), నందిగామలో కే బాబూరావు (కాంగ్రెస్), తమ్ము శ్రీను (కాంగ్రెస్), టి.డేవిడ్‌రాజు (కాంగ్రెస్), వేల్పుల రమేష్‌బాబు (టీడీపీ), జగ్గయ్యపేటలో శ్రీరాం శ్రీదేవి (టీడీపీ), సురేష్‌కుమార్ (పిరమిడ్ పార్టీ), ఎన్ రమేష్ (స్వతంత్ర) నామినేషన్లు తిరస్కరించారు. నూజివీడులో జి.సుష్మా(స్వతంత్ర) వయసు 24 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండటంతో నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.