డీటీసీపీలుగా పదోన్నతులకు నిబంధనల సడలింపు: శైలేంద్ర కుమార్ జోషి | Relaxation of rules to DTCP promotions | Sakshi
Sakshi News home page

డీటీసీపీలుగా పదోన్నతులకు నిబంధనల సడలింపు: శైలేంద్ర కుమార్ జోషి

Published Thu, Nov 14 2013 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

పురపాలక శాఖలో పట్టణ ప్రణాళిక విభాగ అదనపు సంచాలకులుగా ఉన్న ముగ్గురు అధికారులకు పట్టణ ప్రణాళిక సంచాలకులుగా పదోన్నతి కల్పించడానికి నిబంధనల్లో సడలింపునిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖలో పట్టణ ప్రణాళిక విభాగ అదనపు సంచాలకులుగా ఉన్న ముగ్గురు అధికారులకు పట్టణ ప్రణాళిక సంచాలకులుగా పదోన్నతి కల్పించడానికి నిబంధనల్లో సడలింపునిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సంచాలకులు వి.నరేందర్, ఎస్. దేవేందర్‌రెడ్డి, ఎస్. బాలకృష్ణ పేర్లను కూడా డెరైక్టర్ పదవి కోసం తాత్కాలిక పద్దతిలో పదోన్నతులు కల్పించడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో కోరారు. జీహెచ్‌ఎంసీలో హౌస్ నంబరింగ్ సెల్, పురపాలక శాఖలో డెరైక్టర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో డెరైక్టర్ ప్లానింగ్ పోస్టుల కోసం వీరి పేర్లు పరిశీలించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement