పరిశోధనలకు నిలయం | Research home | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు నిలయం

Published Fri, Aug 1 2014 1:48 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

పరిశోధనలకు నిలయం - Sakshi

పరిశోధనలకు నిలయం

  • ఎస్వీయూ వైరాలజీ విభాగంతో  ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థల ఒప్పందాలు
  •  పరిశోధనా సంస్థలో ఉద్యోగాలు
  • శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వైరాలజీ విభాగం నాణ్యమైన పరిశోధనలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ విభాగానికి పలు ప్రతిష్టాత్మక సంస్థలు పరిశోధనల కోసం నిధులు కేటాయించాయి. ఎన్నో ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మొక్కలు, పంటలకు సోకే వైరస్‌లు, వాటి నిర్ధారణ, వైరస్‌ల నివారణకు అవసరమైన ఔషధాలు కనుగొనడం..  మనుషుల్లో ఉన్న వైరస్‌లను గుర్తించడానికి, అందుకు కావాల్సిన పరికరాలు.. తదితర అంశాలపై ఇక్కడ పరిశోధనలు సాగుతున్నాయి. మనుషులకు సోకే చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధి, డెంగీ జ్వరం తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడి ప్రయోగశాలలో రూపొందించిన వైరస్ నిర్ధారణ కిట్లను ఎస్వీయూ ఆరోగ్యకేంద్రం, స్విమ్స్‌లో వాడుతుండడం విశేషం.     

    యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ వైరాలజీ విభాగంలో పీజీ కోర్సులతో పాటు  ఎంఫిల్, పీహెచ్‌డీ  కోర్సులు నిర్వహిస్తున్నారు. 1987లో వృక్షశాస్త్ర పరిశోధనలకు ఓ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.  మనదేశంలో ఎమ్మెస్సీ వైరాలజీని అందించే ఏకైక విశ్వవిద్యాలయం ఎస్వీయూనే. 1987లో ఏర్పా టైన ఈ విభాగంలో తొలిసారి సెమిస్టర్ విధానాన్ని  ప్రవేశపెట్టిన ఘనత ఈ విభాగానిదే. ఈ విభాగంలో ఎమ్మెస్సీలో 18 మందికి ప్రవేశం కల్పిస్తారు. 12 సీట్లు రెగ్యులర్ కోటాలో, 6 సీట్లు సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీలో ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో 9 మంది, ద్వితీయ సంవత్సరంలో 5 మంది పీజీ చేస్తున్నారు. ఐదుగురు అధ్యాపకులు వీరికి బోధిస్తున్నారు.
     
    పరిశోధకులే అధికం

    ఎమ్మెస్సీ వైరాలజీ చదివే వారికన్నా పరిశోధనలు చేసేవారే ఇక్కడ అధికంగా ఉన్నారు. 14 మంది పీజీ చేస్తుంటే, 30 మంది పరిశోధనలు చేస్తున్నారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీకి 34,545 రూపాయలు, రెగ్యులర్ కేటగిరీకి రూ.9,545 ఫీజు చెల్లించాల్సి ఉంది.

    ప్రతికూలతలు
     
    పరిశోధన సంస్థల్లో  ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే వైరాలజీ  విద్యార్థులు పీజీ చేసిన  వెంటనే ఉద్యోగాలు  వచ్చే అవకాశం తక్కువగా ఉంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్  పోస్టులకు వీరు అర్హులు కారు. అందువల్ల పీజీ కోర్సుల్లో ఎక్కువ మంది  చేరడంలేదు. ఇటీవల కాలంలో ఇంటర్‌స్థాయిలో  బయాలజీ చేసేవారి సంఖ్య తగ్గడం వల్ల కూడా పీజీ చేరేవారి  సంఖ్య తక్కువనే చెప్పాలి.
     
    పరిశోధనల్లో పురోగతి
    ఈ విభాగంలో పంటలకు సోకే వైరస్‌లు, మొక్కల్లో వ్యాపించే  వైరస్‌లు, వాటివల్ల కలిగే  ప్రభావం తదితరాలపై పరిశోధనలు చేస్తున్నారు. చికున్‌గున్యా, డెంగీ, మెదడు వాపు వ్యాధి కలిగించే వైరస్‌లు, స్క్రబ్‌టైఫస్ వైరస్, లెప్టోస్పైరోసిస్ వైరస్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి.
     
    మస్రస్ వెటర్నరీ కళాశాలతో కలిపి గాలి కుంటువ్యాధి, పశువులు, పక్షుల్లో వచ్చే వ్యాధులకు టీకా మందుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి.
     
    సూక్ష్మజీవుల్లో ఉండే ఎంజైమ్‌లు, పారిశ్రామికపరంగా ఏంచేయవచ్చు అనే అంశంపై పరిశోధనలు  జరుగుతున్నాయి.
     
    సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ, వ్యాధి నివారణకు అవసరమైన కిట్ల తయారీపై పరిశోధనలు చేస్తున్నారు.
     
    డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)ఆధ్వర్యంలో  రెండు కోట్ల రూపాయల పరిశోధన జరుగుతున్నాయి. సైనికులకు వచ్చే వ్యాధులు, క లిగే వైరస్‌లపై ఈ పరిశోధన జరుగుతోంది. ఇందుకు అవసరమైన వ్యాక్సిన్ల కోసం  40 లక్షల రూపాయలతో మరో పరిశోధనా ప్రాజెక్టు పురోగతిలో ఉంది. ఈ పరిశోధనలో భాగంగా ముందుగా కోతులపై ప్రయోగాలు  చేస్తారు. అనంతరం పరిశ్రమలకు ఇచ్చి పరిశోధనలను ముందుకు తీసుకెళుతారు.
     
    ప్లేస్‌మెంట్
     
    ఎమ్మెస్సీ వైరాలజీ విద్యార్థులకు గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. బెంగళూరులోని బయోకాన్, నాగార్జున ఫర్టిలైజర్స్, మ్యాట్రిక్స్, పార్మా క ంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఏడాది 15 మంది  ఉద్యోగాలు పొందారు.
     
    ఉపాధి అవకాశాలకు కొదవ లేదు

    వైరాలజీ విభాగంలో పరిశోధనలు పూర్తి చేసినవారికి  ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఢిల్లీలోని   ఆలిండియా  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌సెన్సైస్ (ఎయిమ్స్)లో 12 మంది, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ(ఎన్‌ఇఈ)లో కీలక స్థానాల్లో నలుగురు పనిచేస్తున్నారు. వైద్య, వ్యవసాయ, పశువైద్య రంగాల్లో ఈ కోర్సుకు ప్రాధాన్యత ఉంది. ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయి.
     
    పరిశోధనలకు ప్రోత్సాహం

    వైరాలజీలో పరిశోధనలు చేసేవారికి యూరోపియన్ కమిషన్ ఎరాస్ మం డస్ అనే పథకం కింద పరిశోధ నలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఐదుగురు పరిశోధనల కోసం యూరఫ్ వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఆర్కిషి ఆచంటి వైరాలజీ విభాగానికి విచ్చేసి నెలరోజులుగా పరిశోధన లు చేస్తోంది. వైరాలజీ విభాగంలో వసతులు బాగున్నాయని ఆమె చెప్పారు.
     
    పరిశోధనలు చేస్తే ప్రయోజనం
    వైరాలజీ విభాగంలో పీజీ చేసినందువల్ల పెద్దగా ఉద్యోగాలు లభించవు. అయితే పరిశోధనలు పూర్తిచేసి ఏదైనా పరిశోధన సంస్థలకు వెళితే మాత్రం చక్కటి ఉపాధి పొందవచ్చు. వైరాలజీ పీజీ, పీహెచ్‌డీలు చేసినవారికి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్  పోస్టులకు అర్హత కల్పించాలని   ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాం.
     - ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్, వైరాలజీ విభాగాధిపతి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement