రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి
Published Mon, Sep 9 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : పెరుగుతున్న నిత్యావర సరుకుల ధరల కు అనుగుణంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచడానికి కృషి చేయాలని ఆల్ పెన్షన ర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం ఎంపీ ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయనను పెన్షనర్లు కలిసి సమస్యలు వివరించారు. కోల్‌మైనింగ్ పెన్షన్ స్కీం-98 అమలులోకి వచ్చి 15 ఏళ్లు గడిచినా పెన్షన్ పెరగలేదని, 1971 నుంచి అమలులో ఉన్న కోల్‌మైన్స్ ఫ్యామిలీ పెన్షన్ స్కీంను రద్దు చేసి అందులో పేరుకుపోయిన నిల్వ, నిధులను మూలధనంగా సీఎంపీఎఫ్-98లో విలీనం చేశారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వద్ధాప్యలో భద్రత కల్పించలేకపోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ మూడేళ్లకు విలువ కట్టి పెన్షన్ పెంచాలని చట్టంలో ఉన్నా అమలు చేయడంలేదని తెలిపారు. ధరలకు అనుగుణంగా కరువు భత్యం చెల్లించాలని, మినిమం పెన్షన్ రూ.6,500 ఇవ్వాలని, వేజ్‌బోర్డు వర్తింపజేయాలని, పెన్షనర్ మరణిస్తే డెత్‌రిలీఫ్ సౌకర్యం కింద రూ.10వేలు ఇవ్వాలని, సర్వీసును పూర్తిగా పెన్షనుగా పరిగణించాలని, అంగవైకల్యం చెందిన వారికి సర్వీసుతో నిమిత్తం లేకుండా పెన్షన్ చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు కుంబాల లక్ష్మ య్య, కష్ణారెడ్డి, రావుల ఓదెలు, సీహెచ్ సాంబ య్య, గజ్జెల వెంకటి తదితరులున్నారు.
Advertisement