సాక్షి ప్రతినిధి, కాకినాడ :బలుసుతిప్పలో ఎప్పటిలాగే పెత్తందార్లదే పై చేయి అయ్యింది. బెల్ట్‌షాపు, రేవుపాట, ఉప్పుమడుల కు బహిరంగంగానే అనధికారిక వే లం నిర్వహించి తమ పెత్తనానికి ఎ దురేలేదని చాటారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ ముందుగానే వెల్లడించినా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్.. ఇలా అన్ని శాఖల అధికారులు నిస్సిగ్గుగా అస్త్రసన్యాసం చేశారు. ‘అక్కడ వారి చూపుడువేలే చట్టం’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అధికార, రాజకీయ వర్గాలతోపాటు జిల్లా అంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారి అందరిదృష్టి ‘బలుసుతిప్ప’వైపే ఉన్నా నిరోధించాల్సిన అధికారులు అటు తొంగి చూడలేదు.
దాంతో స్థానిక ప్రజాప్రతినిధి సమక్షంలో పాతపేట రామాలయం వద్ద శనివారం టెంట్లు, కుర్చీలు వేసి మరీ బహిరంగంగా వేలం నిర్వహించారు. ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారయంత్రాంగం వేలంపాటలను అడ్డుకుంటుందన్న ప్రచారంతో మధ్యాహ్నం వరకు గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. అయితే అధికారుల నుంచి భరోసా వచ్చిందో, రాజకీయంగా మద్దతు దొరికిందో కానీ.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు యథేచ్ఛగా వేలం కొనసాగించారు. సుమారు 60 మంది ధరావతులు క ట్టి వేలంలో పాల్గొన్నారు. బలుసుతిప్పలో బెల్ట్‌షాపు ఏర్పాటు పాట రూ.14.50 లక్షలకు ఖరారైంది.
రేవుపాట రూ.లక్షకు, ఏడు ఉప్పుమడుల పాటలు వరుసగా రూ.లక్షా 80వేలు, రూ.81వేలు, రూ.80వేలు, రూ.45వేలు, రూ.83వేలు, రూ.21వేలు, రూ.45వేల చొప్పున ఖరారయ్యాయి. పాటల ద్వారా వచ్చిన సొమ్మును గ్రామంలో జాతరలు, కాళ్ళ భైరవస్వామి తీర్థం, ఇతర ఖర్చులకు వినియోగిస్తామని పెత్తందార్లు నమ్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వేలంపై అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యను వివరణ కోరగా విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఔను.. చూపుడువేలితో శాసించారు
Published Sun, Dec 14 2014 12:39 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement