సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ప్రారంభమైన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంమంత్రి సుచరిత, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. కాగా రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment