Sand new policy
-
ఇసుక సమస్యకు చెక్
సాక్షి, విజయనగరం : ఇసుక సమస్యకు ఇక చెక్ పడనుంది. ఇన్నాళ్లుగా ఇదో ఆయుధంగా మలచుకున్నవారి నోటికి తాళం పడనుంది. గురువారం ఉదయం నుంచే ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని జిల్లా సయుక్త కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల ఇసుక ర్యాంప్‌లు నీటితో తడిసిపోవడం వల్ల నెలరోజుల పాటు ఇసుక సరఫరా చేయలేదన్నారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో అధికారులు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులకు బుధవారం ఇసుక సరఫరాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చెయ్యాలని ఆదేశాలు జారీచేశారన్నారు. జిల్లాలో 26 మండలాల్లో 70 ఇసుక రీచ్ లను గుర్తించామనీ, ఈ రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను 70 మంది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడమైందన్నారు. మిగిలిన మండలా ల్లో కూడా ఇసుక రీచ్ లను గుర్తిస్తామని, వీరికి ఇసుక అవసరమైతే గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేయ్యాలన్నారు. కార్యదర్శులు స్మార్ట్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్3 ఫారం జనరేట్ చేసుకోవాలన్నారు. ఫారం జనరేట్ అయిన తర్వాత యూనిక్ నంబరు వస్తుందని దానిని ప్రింట్ తీసుకోని, 48 గంటల లోపు ఇసుకను తీసుకు వెళ్లాలన్నారు. ఒక టన్ను ఇసుక ధర రూ.375లు గా నిర్ణయించామనీ, ఇందులో రూ.285 లు ప్రభుత్వానికి, మిగిలిన రూ.90 లు లోడింగ్ చార్జీల కింద కార్మికులకు చెల్లించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చెయ్యాలని స్పష్టం చేశారు. ఒక ఎడ్ల బండికి అరటన్ను కు రూ.150లు, ఒక ట్రాక్టర్‌కు నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుందని, రూ.1283 లు అవుతుందన్నారు. ఇసుకను యంత్రాలతో లోడ్ చేయవద్దని, కార్మికుల ద్వారా లోడింగ్ చేయించాలన్నారు. వాహనానికి ఎస్3 ఫారం అతికించాలని, అది లేకుండా ఇసుకను తరలిస్తే మొదటిసారి రూ.10 వేలు, రెండవసారి రూ.20 వేలు జరిమానా, మూడవ సారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రెండురోజుల తర్వాత నేరుగా నగదు స్వీకరించే అవకాశం కల్పిస్తామని వివరిచారు. జిల్లాకు 1,50,000 టన్నుల నుంచి 2లక్షల టన్నుల వరకు అవసరమని తెలిపారు. నీతి, నిజాయితీగా, పారదర్శకంగా పనిచెయ్యాలని, ఎటువంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా అర్హులైన వారికే ఇసుక కేటాయించాలన్నారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు పూర్ణ చంద్రరావు, సహాయ సంచాలకుడు ఎస్.వి.రమణారావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎన్ఐసీ అధికారి నరేంద్ర కుమార్ , ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ఇసుక
-
ఇసుక.. ఇక చవక
సాక్షి, అమరావతి: ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందచేసే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుకపై కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆంధ్రా బ్యాంకు పేరును యథాతథంగా కొనసాగించేలా ప్రధానిని కోరాలని, ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, శ్రీరామనవమి నుంచి పెంచిన వైఎస్సార్ పెళ్లి కానుకను అమలు చేయాలని, జాతీయ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం నిర్ణయాలను సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. ఇసుకపై ఇదీ విధానం.. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం గురువారం నుంచి అమల్లోకి రానుంది. ప్రజలకు సరసమైన ధరకు ఇసుక లభించేలా కొత్త విధానాన్ని రూపొందించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే భారీగా ధర తగ్గిస్తూ, పారదర్శకంగా నేరుగా వినియోగదారులకు ఇసుక చేరవేయనున్నారు. బుధవారం నాటికి 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబరు నాటికి వీటిని 70 నుంచి 80 వరకు పెంచనున్నారు. స్టాక్ పాయింట్లను క్రమేణా మరిన్ని పెంచనున్నారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు. 10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు. పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యతను ఏపీఎండీసీకి అప్పగించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు క్యూబిక్ మీటరుకు రూ.60 చొప్పున ఏపీఎండీసీ రైతులకు చెల్లించనుంది. లోడింగ్, తవ్వకాల రూపంలో రైతులపై ఎలాంటి భారం ఉండదు. దీన్ని ఏపీఎండీసీనే భరిస్తుంది. 82 చోట్ల పట్టా భూములను ఎపీఎండీసీ గుర్తించింది. 100 రీచ్‌లను సిద్ధం చేసింది. 31 చోట్ల డీ సిల్టేషన్ చేపట్టనుంది. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ తప్పనిసరి. రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు, స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది. అనుమతి లేని వాహనాల్లో ఇసుక రవాణా చేయకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధించారు. 3.97 లక్షల మంది ఆటో, టాక్సీవాలాలకు రూ.397.93 కోట్ల ఆర్థిక సాయం.. సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భార్య, భర్త ఇద్దరినీ ఒకే యూనిట్‌గా పరిగణించాలని, అదే కుటుంబంలో మేజర్ కుమారుడు లేదా కుమార్తె ఓనర్ కం డ్రైవర్లుగా ఉంటే వారిని వేరే యూనిట్‌గా పరిగణించాలని నిర్ణయించారు. ఇన్సూరెన్స్, ఫిట్నెస్, రిపేర్ల కోసం ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్రంలో 2019 మార్చి నెలాఖరు వరకు 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్టు అంచనా. ఇందులో సొంతంగా నడుపుతున్న వాటి సంఖ్య 3.97 లక్షలుగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో 3.97 లక్షల మంది ఆటో, టాక్సీ వాలాలకు ఏడాదికి రూ.397. 93 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. అయితే లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగినా భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు 4వ వారం నుంచి లబ్ధిదారులకు ఆర్ధిక సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం ఆ రశీదును గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారులకు అందించనున్నారు. నవమి నుంచి ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ పెంపు శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్ఆర్ పెళ్లి కానుక’ను అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పథకం లబ్ధిదారులు దాదాపు 96,397 మంది ఉంటారని అంచనా వేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది. వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద ఎస్సీలకు ఇచ్చే నగదును రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఎస్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. వికలాంగులకు నగదు కానుకను రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎస్సీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు, ఎస్టీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 1.20 లక్షలు, బీసీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 70 వేలు చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ నెట్టింట్లో బుక్ చేస్తే.. నట్టింటికే వస్తుంది ఇసుక బుకింగ్ కోసం నేటినుంచి అందుబాటులోకి వెబ్సైట్ ఇసుక అవసరమైన వారి కోసం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి అందుబాటులోకి తెస్తోంది. sand. ap. gov. in వెబ్సైట్లోకి వెళ్లి ఇసుకను ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. డబ్బు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అధిక పరిమాణంలో ఇసుక అవసరమైన వారు బల్క్ బుకింగ్ అని, వ్యక్తిగత అవసరాలకు కావాల్సిన వారు రిటైల్ వినియోగమని పేర్కొనాలి. దీనికోసం ఆధార్ కార్డును కూడా నమోదు చేయాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ వెబ్సైట్లో స్టాక్ యార్డుల వారీగా ఇసుక నిల్వలను నమోదు చేస్తారు. కావాల్సిన వారు ఆ ప్రకారం బుక్ చేసుకోవచ్చు. స్టాక్ యార్డులో లోడింగ్‌తో కలిపి టన్ను ధర రూ.375 చొప్పున ట్రాక్టరు ఇసుక (4.5 టన్నులు యూనిట్‌గా) ధర రూ.1,677.50గా నిర్ణయించారు. కృష్ణా జిల్లా చెవిటికల్లు స్టాక్ యార్డులో ఇసుక పంపిణీని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం 9 గంటలకు ఇసుక సరఫరాను ప్రారంభిస్తారు. ట్రాక్టర్ ఇసుక కూడా దారి మళ్లడానికి వీల్లేకుండా, అక్రమ తవ్వకాలు, రవాణాకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో రేవులు, స్టాక్ యార్డుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రీచ్‌ల నుంచి స్టాక్ యార్డు వరకూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పర్యవేక్షణలో కాంట్రాక్టర్లు ఇసుక తరలిస్తారు. స్టాక్ యార్డుల నుంచి అవసరమైన వారికి వాహనాల్లో ఇసుక సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వం ఏపీఎండీసీకి అప్పగించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. నిబంధనల్ని ఉల్లంఘించి ఇసుక రవాణా చేస్తే ట్రాక్టరుకు రూ.10 వేలు, లారీకి రూ.25 వేలు, 10 టన్నులు పైబడి రవాణా చేసే లారీలు, యంత్రాలకు రూ.50 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి నిబంధ నలను ఉల్లంఘిస్తే ట్రాక్టరుకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు, పది టన్నుల లోపు లారీకి రూ.25 వేల నుంచి రూ.50 వేలు, పది టన్నులు పైగా ఉన్న లారీలు, యంత్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు గత సర్కారు మిగిల్చిన రూ.132 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,500 చొప్పున ఉన్న ఆశావర్కర్ల జీతం 2018 ఆగస్టు నుంచి రూ.3 వేలకు పెంచుతూ, మరో రూ.3 వేలు ప్రతిభ ఆధారంగా ఇస్తామంటూ గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేబినెట్ ఆమోదించింది. జీతాల రూపంలో వారికి చెల్లించాల్సిన బకాయిలను కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు జనవరి నుంచి జూలై వరకూ బకాయిలు మిగిల్చింది. ఆ బకాయిల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.132 కోట్లను విడుదల చేయగా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. హోదా పోరుపై కేసుల ఉపసంహరణ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ విత్‌డ్రాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం పీడీ చట్టం కింద కేసులు పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు... సింధుకు అభినందనలు జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 నుంచి 2019 వరకు పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటివరకు 162 మంది దరఖాస్తు చేసుకున్నారు. బంగారు పతకానికి రూ.5 లక్షలు, వెండి పతకానికి రూ.4 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు నగదు చొప్పున ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ సాధించిన పీవీ సింధుకు కేబినెట్ అభినందనలు తెలిపింది. ఆంధ్రాబ్యాంకు పేరు అలాగే ఉంచాలని వినతి డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయనున్నారు. డీఆర్డీఓకు 5 ఎకరాలు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థను డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్ లెవల్ పంపింగ్ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నడికుడి–శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్ కోసం 20.19 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. బలిమెల అమరుడి కుటుంబానికి పది సెంట్లు భూమి బలిమెల ఘటనలో అమరుడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో 10 సెంట్ల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. – మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పనులు ప్రారంభించకపోవడంతోనే వెనక్కు తీసుకోవాలని నిర్ణయించారు. – టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25 (ఎక్స్అఫీషియో సభ్యుడు కాకుండా)కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. – మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2005 నుంచి మావోయిస్టులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. – నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3,216.11 కోట్ల టెండర్ రద్దును కేబినెట్ ఆమోదించింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజాగా టెండర్ల ఆహ్వానానికి ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌లు రికవరీ చేసేందుకు కేబినెట్ ఆమోదించింది, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం మేర ఇచ్చిన రూ.780 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రికవరీకి నిర్ణయం తీసుకుంది. -
ఇసుక కొరత తీరేలా..
సాక్షి, అమరావతి: ఇసుక కావాలంటూ జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. భవనాలు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇసుక కేటాయింపులు చేస్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరిస్తున్నారు. మరో వైపు జిల్లాలోని రీచ్‌లలో ఇసుక మరో రెండు నెలలకు మించి వచ్చే అవకాశం లేకపోవడంతో గోదావరి జిల్లాల నుంచి ఇసుక తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు మాత్రం అధికారుల కళ్లుగప్పి ఇసుక తరలించుకుపోతున్నారు. జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుతో మూడు నెలలుగా జిల్లాలోని ఇసుక క్వారీలు మూత పడ్డాయి. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ అమలులోకి తెచ్చే వరకు ఇసుక పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పింది. వారం రోజుల నుంచి జిల్లాలో ఇసుక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇసుక కోసం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ లబ్ధిదారులు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు వారి నుంచి తమకు ఇసుక కావాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ అనుమతులు కేవలం కొల్లిపర, కొల్లూరులోని రెండు మండలాల్లో ఐదు ఇసుక రీచ్‌లకు మాత్రమే వచ్చాయి. అక్కడ కేవలం 2,00,847 క్యూబిక్ ఇసుక నిల్వలు మాత్రమే గుర్తించారు. వారంలోపే 2 వేల మంది 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 20 వేల ట్రాక్టర్లకు సంబంధించి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను కేటాయించారు. ఈ ఇసుక కేటాయింపులు ప్రాధాన్యత క్రమంలో కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇసుక కొరత దృష్ట్యా వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే, జిల్లాలో 5 రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు రెండు నెలలలోపు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక కొరతను అధిగమించేందుకు.. జిల్లాలో ఇసుక నిల్వలు తగినంత లేనందున కొత్త పాలసీ వచ్చేలోపు ఇసుక కొరతను అధిగమించేందుకు వీలుగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎంత మేర ఇసుక అవసరం ఉంటుందో ఆ మేరకు.. ఇసుకను గోదావరి జిల్లాల నుంచి తరలించి మంగళగిరి, తాడేపల్లిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించేందుకుగాను సంబంధిత తహసీల్దార్లతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అగని అక్రమ దందా ఇసుక అక్రమ రవాణా కట్టడికి అధికారులు చర్యలు తీసుకొన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో దందా ఆగటం లేదు. స్థానికంగా ఇసుక క్వారీలు ఉన్న ప్రాంతంలోని అధికారులు ఇసుక తరలింపునకు ఎటువంటి అనుమతి తీసకోకుండానే తెనాలి, చెరుకుపల్లి, రేపల్లె ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంత మంది బిల్టర్లు అవసరానికి మించి ఎక్కువ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇసుకను గుంటూరుకు తరలించి అక్కడ నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి వేలాది రూపాయలు దండుకొంటున్నారు. ఇసుక ట్రాక్టర్ల ద్వారానే తరలించాలని నిబంధన ఉంది. అయితే కొంత మంది క్వారీల సమీపం నుంచి నేరుగా కృష్ణా జిల్లా పర్మిట్లను అడ్డుపెట్టుకొని ఇసుక తరలిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారు. అధికారుల అనుమతితో తీసుకున్న ఇసుక నిర్మాణాలు చేపట్టే ప్రాంతంలో ఉండాలి. ప్రభుత్వం ట్రాక్టరు ఇసుక రూ.330కు అందిస్తోంది. అయితే కొంత మంది అక్కమార్కులు ఇసుక లారీ రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు అచ్చంపేట నుంచి క్రోసూరు, రాజుపాలెం, పిడుగురాళ్ల మీదుగా ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన ఇసుక రీచ్‌లు పాత బొమ్మువానిపాలెం రీచ్‌లో 4,853 హెక్టార్లలో 48,530 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు. కొల్లూరు మండలం గాజులంక–1 రీచ్‌లో 3,340 హెక్టార్ల విస్తీర్ణలో 33,399 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. కొల్లూరు మండలం ఈపూరు రీచ్‌లో 4,985 ఎకరాల్లో 48,530 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు కొల్లిపర మండలం పిడపర్తివారిపాలెం, బొమ్మువానిపాలెం గ్రామాల పరిధిలోని రీచ్‌లో, 3,340 హెక్టార్లలో 36,989 క్యూబిక్ మీటర్ల ఇసుకను గుర్తించారు. కొల్లిపర మండలం అత్తలూరిపాలెం–1, అత్తలూరిపాలెం రీచ్‌లో 3,700 హెక్టార్లలో 36,989 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉన్నట్లు గుర్తించారు. -
ఆగస్టు నుంచే ఇసుక కొత్త విధానం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన దానికంటే 15 రోజుల ముందే ఇసుక కొత్త విధానం ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని భూగర్భ గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి ఇసుక కొత్త విధానం అమల్లోకి తెద్దామని సీఎం ప్రకటించారని, అయితే ఆగస్టు 15వ తేదీ నుంచే అమలు చేద్దామని అధికారులకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, భూగర్భ గనులు, జలవనరులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ప్రజలకు లభిస్తున్న ధరకంటే తక్కువకే ఇసుకను అందించాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. రెండు మూడు క్వారీలకు సమీపంలో ఒకటి చొప్పన ఇసుక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడకు ఇసుక తరలించేందుకు కాంట్రాక్టరు ఖరారు కోసం టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. స్టాక్ యార్డు నుంచి వినియోగదారులు కోరిన ప్రాంతానికి ఇసుకను రవాణా చేసేందుకు కిలోమీటరుకు ఏయే వాహనాలకు ఎంతెంత చెల్లించాలో రవాణా శాఖ అధికారులతో రేటు ఖరారు చేయించాలని సూచించారు. తర్వాత దీనిని అప్పర్ ప్రైస్‌గా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికి కాంట్రాక్టు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒక్కో సంస్థకు రెండు రీచ్‌లకు మించి అప్పగించరాదని మంత్రి పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. స్టాక్ యార్డుల వద్ద వే బ్రిడ్జిలు ఇసుక రీచ్‌ల సమీపంలో వేబ్రిడ్జిలు గుర్తించాలని, లేకపోతే నిర్మించి సొంతంగా నిర్వహించే (బీఓఓ) పద్ధతిలో ఏర్పాటుకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. కొత్త విధానంలో ప్రజలకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్వహిస్తుందని, ఈ మేరకు ఏపీఎండీసీని ప్రభుత్వ ఏజెంట్‌గా నియమిస్తామన్నారు. ఏయే ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి? ఎంత పరిమాణంలో ఇసుక ఉంది? పర్యావరణ, ఇతర అనుమతులు ఏయే రీచ్‌లకు తీసుకోవాలో గుర్తించి త్వరగా అనుమతులు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుకను స్టాక్ యార్డుల్లో ఎంతకు విక్రయించాలి, రవాణా చార్జీలు టన్నుకు ఎంత చెల్లించాలో తేల్చాలని ఆదేశించారు. అలాగే ఇసుకతోపాటు ఖనిజ రవాణా చేసే వాహనాలన్నింటికీ జీపీఎస్ అమర్చాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ సబ్ ప్లాన్ (టీఎస్పీ) ప్రకారం ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డులకు రవాణా బాధ్యతలను గిరిజన సొసైటీలకే అప్పగించాలని మంత్రి ఆదేశించారు. కొత్త పాలసీ అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీ నరేష్ తదితరలు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ
సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. ప్రతి వాహనానికీ జీపీఎస్ ‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఏర్పాట్లకు రెండు నెలల సమయం ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్ యార్డులు, వేయింగ్ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. సిలికా అక్రమ తవ్వకాలకు చెక్ నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది. ► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది. ► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది. ► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్ లోడ్ చేయిస్తారు. ► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు. ► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తారు. ► ఇసుక కావాల్సిన వారు వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని జీపీఎస్ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు. ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
ఇసుక కొత్త విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ప్రారంభమైన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంమంత్రి సుచరిత, ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు. కాగా రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇసుక కొత్త విధానంపై కసరత్తు
సాక్షి, అమరావతి: ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం, ప్రజలపై అదనపు భారం పడకుండా రాబడి పెంపు లక్ష్యంగా ఇసుకపై కొత్త విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగిన ఇసుక దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రస్తుత విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం మేరకు అన్ని రకాలుగా ఉత్తమ విధానం రూపకల్పనపై వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను అధికారులు అధ్యయనం చేశారు. వీటన్నింటినీ సమీక్షించిన అనంతరం తెలంగాణలో అమల్లో ఉన్న విధానమే ఉత్తమమైనదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిన్నచిన్న లోపాలను సరిచేస్తే తెలంగాణ విధానం అత్యుత్తమమైనదని భూగర్భ గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రాథమికంగా తెలియజేశారు. 17న మంత్రుల సమావేశం ఇసుకపై కొత్త పాలసీ అత్యంత కీలకమైన అంశం కావడంతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారు. ఇసుక మాఫియా నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించి కొత్త విధానంపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త విధానం రూపకల్పనపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లతో ఈనెల 17వ తేదీన సమావేశం కానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , ఆర్థిక శాఖ కార్యదర్శి, గనుల శాఖ కార్యదర్శి, గనుల శాఖ ఉన్నతాధికారులను కూడా దీనికి హాజరు కావాలని ఆదేశించారు. తెలంగాణ గనుల శాఖ ఉన్నతాధికారులు, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఉన్నవాటిలో తెలంగాణ విధానమే ఉత్తమం వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానాల్లో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న పద్ధతి ఉత్తమంగా ఉందని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇసుక క్వారీలు అక్కడి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇసుక సరఫరా బాధ్యతను తెలంగాణ సర్కారు టీఎస్ఎండీసీకి అప్పగించింది. క్వారీల నుంచి టీఎస్ఎండీసీ ఇసుకను స్టాక్ యార్డులకు తరలిస్తుంది. స్టాక్ యార్డుల నుంచి ఇసుకను విక్రయిస్తుంది. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్టాక్‌యార్డులో క్యూబిక్ మీటరు (ఒకటిన్నర టన్ను) ఇసుక ధర రూ. 600గా నిర్ణయించారు. ఇసుక రవాణా వాహనదారులంతా టీఎస్ఎండీసీ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. వెబ్సైట్లో లారీ యజమానుల ఫోన్ నంబర్లు ఉంటాయి. ఇసుక కావాల్సిన వారు వాహనదారులకు ఫోన్ చేసి మాట్లాడుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికే సరఫరా చేస్తారు. ఈ విధానంలోని మంచి చెడ్డలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పరిశీలించి లోపాలను సరిదిద్ది ఉత్తమ పాలసీ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, గనుల శాఖ సంచాలకులను ఈ నెల 17న జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ గనుల శాఖ సంచాలకులు సుశీల్‌కుమార్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ గనుల శాఖ సంచాలకులు) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. -
అతివ చేతికి ఇసుకాస్త్రం
ఏలూరు: జిల్లాలో మహిళలకు ఇసుక రీచ్‌లు అప్పగించనుండటంపై స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇసుక కొత్త పాలసీ ద్వారా ఆదాయం పెరగటం అటుంచితే ఈ విధానాన్ని ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందన్న విమర్శలు రేగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టి చేతులు కాలాక ఆకులు పట్టిన చందంగా వదిలేసింది. ఇప్పుడు టీడీపీ సర్కార్ కూడా మహిళలకు రీచ్‌లు అప్పగింత పేరుతో ఇసుక పాలసీని గందరగోళం చేస్తుందన్న ఆందోళన అధికారుల్లో కలుగుతోంది. స్థానికంగా లభించే ఇసుక ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు ఆదాయ వనరుగా ఉండాలి. దీనిని మహిళా సంఘాల పేరిట తెలుగు తమ్మళ్ల స్వాహా పర్వానికి ప్రభుత్వం తెరలేపిందన్నా విమర్శలు వినవస్తున్నాయి. ఇసుక అమ్మకాలపై పరిజ్ఞానం లేని మహిళా సంఘాలను పావులుగా వాడుకుని ఆదాయం తెలుగు తమ్మళ్లు జేబుల్లో చేర్చేందుకు ఈ విధానం అమలుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని మొత్తం 16 ఇసుక రీచ్‌లను మహిళా సంఘాల అప్పగించటంపై ఫిషర్మెన్ సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ ప్రకటించిన నూతన ఇసుక విధానంలో వారి ప్రస్తావన లేదు. ఎన్ని సంఘాలకు అప్పగిస్తారో ఇసుక రీచ్‌లను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన సమాచారం అందిస్తున్న మైనింగ్ శాఖను కూడా ఈ విషయంలో పక్కనపెట్టడం విమర్శలకు ఊతమిస్తోంది. ఏపీ మినరల్స్ కార్పొరేషన్‌కు ఇసుక తరలింపు బాధ్యతలను అప్పగించి, మహిళా సంఘాల ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టే పద్ధతి అవలంబిస్తారని సమాచారం. జిల్లాలో 62వేల డ్వాక్రా సంఘాలున్నాయి. ఈ నేపధ్యంలో ఇసుక రీచ్‌లు ఏ విధంగా అప్పగిస్తారు? ఆదాయం ఎలా పంచుతారనేది మహిళా సంఘాల సభ్యుల్లో చర్చనీయాంశమైంది. మండలంలో చురుకుగా పనిచేసే 20 సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించి, ఇసుక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 75శాతం ప్రభుత్వానికి జమ చేసి, మిగిలిన 25 శాతంలో పనిచేసే సంఘాలకు 50 శాతం, ఇతర సంఘాలకు కూడా కొద్ది మొత్తంలో జమ చేసి మహిళా సంఘాలను సంతృప్తి పరచే ఎత్తుగడకు ప్రభుత్వం దిగినట్లు భావిస్తున్నారు. మహిళా సంఘాలు కొన్ని చోట్ల శక్తిమేరకు పనిచేస్తూ లాభాలు గడిస్తున్నా మేజర్ సంఘాలు మాత్రం పొదుపు సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాయి. ధాన్యం సేకరణ వ్యవహారంలోనే కొన్ని సంఘాలు అవకతవకలకు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇసుక రేటు బంగారం కన్నా మిన్నగా ఉన్న తరుణంలో రీచ్‌ల అప్పగింత, ఇతర వ్యవహారాలు పారదర్శకంగా సాగితేనే ప్రభుత్వ నిర్ణయానికి ఓ అర్ధం ఉంటుంది. ఆదాయ వనరులు నిర్వీర్యం గతంలో రెండేళ్ల కాలానికే రూ.24 కోట్ల ఆదాయం ఇసుక రీచ్‌ల వేలం ద్వారా లభించింది. ఇసుక తవ్వకాలను శాస్త్రీయంగా చేపట్టాలనే యోచనతో పర్యావరణ పరిమితులున్న చోట్లే రీచ్‌ల నుంచి ఇసుకు తీసుకునే విధానాన్ని రూపొందిస్తూ దానిని జిల్లా స్థాయి అధికారుల చేతుల్లో పెట్టడం దొంగచేతికి తాళాలు ఇచ్చిన మాదిరిగానే ఉందనేది పలువురి అభిప్రాయం. పొక్లెయిన్లను నిరోధించటం కొత్త విధానంలో సాధ్యమయ్యే అవకాశం కన్పించటం లేదు. మహిళా సంఘాలు కేవలం పోగుబడిన ఇసుక విక్రయించటమనేది పూర్తిస్థాయిలో లోపభూయిష్టమే. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలపై క్షేత్రస్థాయిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి వ్యవహారాన్ని ఆన్లైన్లో రికార్డు చేస్తేనే పర్యవేక్షించటానికి సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక రీచ్‌ల అప్పగింతపై ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు కాలేదని మైనింగ్‌శాఖ ఏడీ వైఎస్ బాబు తెలిపారు.