రైస్ మిల్ నిర్వాహకులు అరెస్ట్ | rice mill owners arrested in anatapur | Sakshi
Sakshi News home page

రైస్ మిల్ నిర్వాహకులు అరెస్ట్

Published Fri, Mar 27 2015 9:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

rice mill owners arrested in anatapur

కదిరి(అనంతపురం): చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వాహకులు కిశోర్, రెడ్డెప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పలు జిల్లాల్లో రైతులు, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మోసం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లికి చెందిన వేణుగోపాల్ అనే రైస్ మిల్లు యజమాని నుంచి ధాన్యం సేకరించి రూ. 9.50 లక్షల మేర ఎగ్గొట్టారు. ఆయన నేరుగా కోర్టును ఆశ్రయించటంతో కోర్టు ఉత్తర్వుల మేరకు తలుపుల పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రైతులు, రైస్‌మిల్లు యజమానులను రూ.3 కోట్ల మేర మోసగించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. వీరిని ధర్మవరం కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తిరిగి కస్టడీలోకి తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement