కర్నూలు(న్యూసిటీ): అతిరుద్ర యాగంలో భాగంగా సుంకేసుల రోడ్డులోని కేజి.గోవిందరెడ్డి స్థలంలో సోమవారం శ్రీరాధాకృష్ణ, ఉమామహేశ్వర స్వామి వార్లకు వెయ్యి లీటర్ల ఆవు పాలతో అభిషేకం నిర్వహించారు. వినాయక స్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకాన్ని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ జరిపారు. లక్ష్మీ గణపతి, నవగ్రహ హోమాలు ఘనంగా నిర్వహించారు.
పరమేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, గణపతి స్వామి వార్లకు అష్టోత్తర శతనామావాళి మంత్రాలను వేద పండితులు పఠించా రు. గురుపూజ, మహా పూర్ణాహుతి రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వర స్వా మి వార్ల విగ్రహాలకు వేద మంత్రాల మధ్య పవిత్రమైన తుంగభద్ర నదీ జలాలతో స్నానం చేయించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. తుంగభద్ర నదీమ తల్లి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పుణ్య హారతులు ఇచ్చారు.
రాత్రి వేద మంత్రాల మధ్య శ్రీరాధాకృష్ణుల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఈశ్వరునికి పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కమిటీ సభ్యులు, వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి అమర సింహారెడ్డి, రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి, సముద్రాల హనుమంతరావు, వాసుదేవయ్య, రమణ పాల్గొన్నారు.
ఘనంగా అభిషేకం
Published Tue, Nov 25 2014 3:31 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement