అమలాపురంలో సినీ ఫక్కీలో దోపిడీ
Published Wed, Sep 10 2014 8:10 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
అమలాపురం: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం సినీ ఫక్కీలో దోపిడి జరిగింది. ఓ వ్యాపారి బ్యాంకు నుంచి 25 లక్షలు రూపాయల్ని డ్రా చేసి తీసుకెళ్తుండగా నగదు దుండగులు అపహరించారు. అయితే వ్యాపారి దొంగలను వెంబడించడంతో దిక్కు తోచని దుండగులు రోడ్డుపై నగదు సంచి విసిరేసి పారిపోయారు.
ఈ వ్యవహారంలో నలుగురు దుండగులను పల్లంకుర్రు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ దుండగులను తమిళనాడుకు చెందిన ముఠాగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. వ్యాపారి ధైర్య సాహసాల్ని పలువురు అభినందించారు.
Advertisement
Advertisement