చిలమత్తూరు :ఓ ప్రభుత్వోద్యోగి పట్టపగలే దారిదోపిడీకి గురయ్యాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జయకుమార్ సోమవారం దారిదోపిడీకి గురయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బైరేకుంట ప్రధాన రహదారిపై నలుగురు వ్యక్తులు జయకుమార్ను అటకాయించి కత్తితో బెదిరించి అతని చేతికి ఉన్న మూడు ఉంగరాలు, రూ.5 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ దోచుకున్నారు.
దుండగులు రెండు ద్విచక్రవాహనాలపై ముసుగులు ధరించి రావడంతో జయకుమార్ వారిని గుర్తుపట్టలేకపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.