రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో స్వామివారికి, అమ్మవారికి శివరాత్రి పూట అధికారులు గిల్టు నగలు అలంకరించారు. బంగారు నగలు అలంకరించడానికి బదులు.. గిల్లు నగలు అలంకరించడంతో భక్తులు తీవ్రంగా అసంతృప్తి చెంది, అధికారుల మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
శివరాత్రి పర్వదినం ఒక్కటే ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం. సంవత్సరం మొత్తమ్మీద ఒక్కసారి మాత్రమే వచ్చే ఇలాంటి పర్వదినం రోజున కూడా స్వామి వారికి, అమ్మవారికి బంగారు నగలు అలంకరించకుండా.. గిల్లు నగలు అలంకరించడంతో ఇది అపచారమేనని మండిపడుతున్నారు. తగినంత మంది భద్రతా సిబ్బంది ఉన్నా కూడా ఈ విషయాన్ని వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం వీవీఐపీలు, వారి బంధువులకు దర్శనాలు చేయించడానికి మాత్రమే వారు పరిమితం అయ్యారు.
శ్రీకాళహస్తీశ్వరునికి గిల్టు నగలా?
Published Thu, Feb 27 2014 11:17 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement