ఆర్టీసీ బస్సు బోల్తా.. | rtc bus falldown in canal at krishna district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా..

Published Tue, Feb 16 2016 2:21 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

ఆర్టీసీ బస్సు బోల్తా.. - Sakshi

ఆర్టీసీ బస్సు బోల్తా..

అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అవనిగడ్డ మండలం రామచంద్రాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు పంట కాల్వలోకి బోల్తా కొట్టింది. ఈ బస్సు కోడూరు నుంచి అవనిగడ్డ వైపు వెళుతుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులోని 16 మంది ప్రయాణికులతోపాటు, డ్రైవర్, కండక్టర్‌లు ఉన్నారు. 9 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement