హైదరాబాద్ : ఆర్టీసీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. ఆర్టీసీ విభజనపై శుక్రవారం బస్ భవన్లో పాలకమండలి సమావేశమైంది. విభజనపై జవహర్ కమిటీ రిపోర్టుపై చర్చ జరిగింది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్తులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించొద్దని టీఎంయూ నేతలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
అయితే చట్టప్రకారం పంపకాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. జవహర్ కమిటీ నివేదిక తప్పులతడకగా ఉందని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో పాలకమండలి సమావేశం అర్థాంతరంగా వాయిదా పడింది. ఆర్టీసీలో ఆస్తులు, అప్పుల విజభనపై జవహర్ కమిటీని వేసిన విషయం తెలిసిందే.