రన్నింగ్ సన్ డే! | Running Sun Day! | Sakshi
Sakshi News home page

రన్నింగ్ సన్ డే!

Published Mon, Dec 5 2016 3:40 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

రన్నింగ్ సన్ డే! - Sakshi

రన్నింగ్ సన్ డే!

ఎండలోనే పోలీస్ పరుగు
మధ్యలోనే సొమ్మసిల్లిన పలువురు మహిళా అభ్యర్థినులు
నాలుగోరోజు మెయిన్ పరీక్షకు అర్హత సాధించినవారు 638 మంది

 
ఒంగోలు: పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక కోసం అభ్యర్థులు ఎండను సైతం లెక్కచేయక లక్ష్యం వైపు పయనించారు. ఈ క్రమంలో పలువురు మహిళా అభ్యర్థినులు పరుగు మధ్యలో సొమ్మసిల్లి పడిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. అరుుతే వారికి తక్షణ వైద్య సాయం అందించడంలో పోలీస్, వైద్య శాఖలు తక్షణం స్పందించారుు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండులో నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష కోసం ఆదివారం 1033 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 395 మంది అనర్హత పొందగా.. 638 మంది మెరుున్ పరీక్షకు అర్హత సాధించారు.  

గతంలో ఇలా..
ఇంతకుముందు ఉదయం నాలుగు గంటలకే పరుగు పరీక్ష మొదలు పెట్టేవారు. అందరికీ ఒకేసారి ప్రారంభించి నిర్ణీత సమయంలో లక్ష్యం చేరుకున్నవారిని గుర్తించేవారు. కానీ ప్రస్తుతం పరుగు పరీక్షకంటే ముందే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టు నిర్వహించాల్సి వచ్చింది. ఇది పూర్తి అరుున వారికే ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టు నిర్వహించాల్సి రావడంతో జాప్యం జరిగింది. నాలుగో రోజైన ఆదివారం పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులకు కూడా పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో సమస్య నెలకొంది. దీనికితోడు రన్నింగ్ ట్రాక్ కేవలం 400 మీటర్లు మాత్రమే కావడంతో నాలుగు రౌండ్లు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉంది. దీంతో నాలుగు రౌండ్లు పరిగెత్తిన వారు ఎవరనే నిర్ధారణకు వచ్చేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.  

149 మహిళా అభ్యర్థులకు అర్హత
ఉదయం 10.30 గంటల నుంచి మహిళా అభ్యర్థినులకు పరుగు పరీక్ష ప్రారంభమైంది. 350 మంది హాజరుకాగా వారిలో 20 మంది నిర్ణీత ఎత్తులో లేరు. మరో నలుగురు అభ్యర్థినులకు బరువు తక్కువుగా ఉన్నారు. ఒక అభ్యర్థిని గైర్హాజరయ్యారు. దీంతో 325 మంది 1600 మీటర్ల పరుగు పరీక్షకు హాజరయ్యారు. ఎండ బాగా ఉండటంతో చాలామంది మార్గమధ్యంలోనే పడిపోయారు. లక్ష్యం చేరుకున్నవారు పోలీసుల చేతుల్లోనే వాలిపోవడం గమనార్హం. 162 మంది విఫలం కాగా, ఒక అభ్యర్థి ఇంటర్‌మీడియెట్ పాస్ సర్టిఫికెట్ చూపించలేదు. మిగిలిన 162 మందికి వందమీటర్ల పరుగు పరీక్ష, లాంగ్‌జంప్ పోటీలు నిర్వహించగా వాటిలో 13 మంది రాణించలేకపోయారు. 149 మందికి మెరుున్ పరీక్షకు ఎంపికై నట్లు అధికారులు ప్రకటించారు.  

పురుషుల్లో 489 మంది..  
683 మంది పురుష అభ్యర్థుల్లో 102 మంది ఎత్తు తక్కువుగా ఉన్నారు. ఆరుగురికి ఛాతీ కొలత తగ్గింది. మిగిలిన 575 మందికి పరుగుపరీక్ష నిర్వహించారు. వీరిలో 54 మంది విఫలం అయ్యారు. దీంతో 521 మందిని వందమీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌కు పంపగా వారిలో 32 మంది అర్హత సాధించలేకపోయారు. మెరుున్ పరీక్షకు 489 మంది అర్హత సాధించినట్లరుుంది. ఎంపిక ప్రక్రియను  డ్రోన్, సీసీ కెమెరాల సాయంతో ఎస్పీ త్రివిక్రమవర్మ, ఓఎస్‌డీ దేవదానం, మార్కాపురం ఓఎస్‌డీలావణ్య లక్ష్మి, ఏఆర్ అదనపు ఎస్పీ టి.శివారెడ్డి , పలువురు డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించారు. ఛాతీ కొలతల్లో తేడాలు వచ్చినవారికి, బరువు తక్కువుగా ఉన్నవారికి మళ్లీ ఈనెల 6వ తేదీ అవకాశం కల్పించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement